Telangana CM Revanth Reddy  Davos 2024 Tour: ఇన్వెస్ట్ ఇన్‌ తెలంగాణ పేరుతో చేపట్టిన క్యాంపెయిన్‌ను ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా ప్రారంభించింది. సోమవారం దావోస్‌ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు  కూడా ఈ టూర్‌లో ఉన్నారు. అధికారులు కూడా పర్యటనలో భాగమయ్యారు. అంతా కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దావోస్ చేరుకున్న వెంటనే రేవంత్ టీం ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటోతో సమావేసమైంది. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్​ మ్యాప్​ ఆయనతో చర్చించారు.



వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్రెసిడెంట్‌ బోర్గోబ్రెండేతో కూడా సమావేశమయ్యారు. ఇతర ప్రముఖులతో కూడా భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో చేపట్టబోయే కార్యక్రమాలు వివరించారు. 
స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలోనే ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో రేవంత్ టీం చర్చలు జరిపింది. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి కోసం నవ తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేందుకు వారంతా మొగ్గు చూపారని తెలిపారు రేవంత్.


తెలంగాణలో ఉన్న వనరులు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. భారీ పెట్టుబడుల లక్ష్యంగానే ఈ టూర్ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దావోస్‌లో మూడు రోజుల పాటు 54వ వరల్డ్ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సు జరగనుంది.