Little Miss Naina OTT Release: గౌరీ జి కిషన్, షేర్షా షరీఫ్ జంటగా నటించిన మలయాళీ మూవీ ‘లిటిల్ మిస్ రాథర్’. దర్శకుడు విష్ణు దేవ్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. జిష్ణు శ్రీకుమార్, నికితా థెరిసా మాథ్యూ, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పొట్టిగా ఉన్న యువతి నైనా రాథర్ (గౌరీ జి కిషన్), పొడవైన వ్యక్తి అభిజిత్ చంద్రదాస్ (షేర్షా షరీఫ్) మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది? ప్రేమలో పడ్డాక ఎలాంటి సమస్యలు ఏర్పడుతాయి? అనేది ఈ సినిమాలో చూపిస్తారు.


ఈటీవీ విన్ లో ‘లిటిల్ మిస్ నైనా’ స్ట్రీమింగ్


మలయాళంలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. థియేటర్లలో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈటీవీ విన్ వేదికగా జనవరి 25 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. అయితే, మలయాళంలో ‘లిటిల్ మిస్ రాథర్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో ‘లిటిల్ మిస్ నైనా’ పేరుతో అలరించబోతోంది.     






‘లిటిల్ మిస్ నైనా’ సినిమా కథ ఏంటంటే?


మధ్య తరగతి కుటుంబలో జన్మించిన నైనా, ఓసీడీ సమస్యతో బాధపడుతుంది. ఆమెకు కాలేజీలో అభిజిత్ పరిచయం అవుతాడు. అతడితో ఆమె ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆమెను విడిచి తను సినిమాల్లో బిజీ అవుతాడు. అప్పుడే నైనా వేరొకరితో పెళ్లికి రెడీ అవుతుందని తెలుస్తుంది. బాధను తట్టుకోలేక, మద్యానికి బానిస అవుతాడు. పెళ్లి చేసుకోబోయే షఫీక్ మంచి వాడు కాదని నైనాకు తెలుస్తోంది. అప్పుడు మళ్లీ అభిజిత్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అభిజిత్ తో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత వీరిద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైంది? అనేవి సినిమాలో చూపించారు. గౌరీ జి కిషన్, షేర్షా షరీఫ్ నటన ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది.  


‘లిటిల్ మిస్ రాథర్’ మూవీని ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సృజన్ యరబోలు, సాధిక్ షేక్ సంయుక్తంగా నిర్మించారు. ‘నిజాల్‘ (2021), ‘హృదయం‘ (2022) లో నటించిన షేర్షా షరీఫ్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా, రచయితగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంతో విష్ణు దేవ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. అన్వర్ అలీ, టిట్టో పి థంకచెన్ సాహిత్యం అందించారు.  సంగీత్ ప్రతాప్ ఎడిటర్ గా వ్యవహిరించారు. ల్యూక్ జోస్ సినిమాటోగ్రఫీ అందించారు. అనఘ, రిష్ధన్ కొరియోగ్రఫీ అందించారు. 


Read Also: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్ - ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చంటే?