Naa Saami Ranga Collection Day 2: కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'నా సామి రంగ'. ఇందులో ఆయనకు జోడీగా కన్నడ భామ ఆషికా రంగనాథ్ నటించారు. 'అల్లరి' నరేష్, తెలుగు 'నాంది' & రజనీకాంత్ 'జైలర్' ఫేమ్ మిర్నా మీనన్ ఓ జంటగా... యువ హీరో రాజ్ తరుణ్, రుక్సార్ థిల్లాన్ మరో జోడీగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల అయ్యింది. అభిమానుల నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?


రెండు రోజుల్లో 'నా సామి రంగ'కు వచ్చిన వసూళ్లు: 



  • నైజాం (తెలంగాణ) - రూ. 1.47 కోట్లు

  • సీడెడ్ (రాయలసీమ) - రూ. 76 లక్షలు

  • విశాఖ (ఉత్తరాంధ్ర) - రూ. 57 లక్షలు

  • ఈస్ట్ గోదావరి - రూ. 54 లక్షలు

  • వెస్ట్ గోదావరి - రూ. 34 లక్షలు

  • కృష్ణ - రూ. 26 లక్షలు

  • గుంటూరు - రూ. 41 లక్షలు

  • నెల్లూరు - రూ. 20 లక్షలు


Also Read: గుంటూరు సక్సెస్‌లో గురూజీ ఎందుకు మిస్సింగ్ - మహేష్ ఇంటికి త్రివిక్రమ్ వెళ్లలేదా?


ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 4.55 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది 'నా సామి రంగ' సినిమా.


మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ
ఏ సినిమా కలెక్షన్స్ అయినా సరే మొదటి రోజు ఎక్కువ ఉంటాయి. తెలుగు సినిమా కలెక్షన్స్ చూస్తే... ఓపెనింగ్ డే రికార్డ్ స్థాయిలో వసూళ్లు వస్తాయి. అయితే... 'నా సామి రంగ' మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్ట్ చేసింది. ఆదివారం (ఈ నెల 14న) సినిమా విడుదలైంది. ఆ రోజు రూ. 4.33 కోట్ల షేర్ రాగా... సోమవారం రూ. 4.55 కోట్ల షేర్ వచ్చింది. రెండు రోజుల్లో మొత్తం మీద రూ. 8.88 కోట్లు కలెక్ట్ చేసింది. గ్రాస్ కలెక్షన్స్ చూస్తే... వరల్డ్ వైడ్ రూ. 17.8 కోట్లు కలెక్ట్ చేసింది.


Also Read'పుష్ప 2' to 'దేవర' - పెద్ద సినిమాలన్నీ ఆ ఓటీటీకే - ఇంకా టైటిల్ పెట్టని సినిమాలతోనూ కీలక ఒప్పందాలు, ఇదిగో లిస్ట్



ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు అంటే?
'నా సామి రంగ' డిజిటల్ & శాటిలైట్ రైట్స్ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్', 'స్టార్ మా' సొంతం చేసుకున్నాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమాకు సుమారు 33 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసింది. దాంతో పాటు సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉండటంతో థియేట్రికల్ రైట్స్... రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ జస్ట్ 18.5 కోట్లకు ఇచ్చేశారు 'నా సామి రంగ' మేకర్స్! డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.