Pushpa 2 OTT Release: సంక్రాంతికి స్టార్‌ హీరో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఆ తర్వాత వరుసగా పాన్‌ ఇండియా సినిమాల జాతర ఉండబోతుంది. 'పుష్ప 2', 'దేవర', 'కల్కి' వంటి పాన్‌ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగు పాన్‌ ఇండియా మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో 'పుష్ప: ది రూల్‌' పార్ట్‌ 2 ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌ రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌తో పార్ట్‌ 2కు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అంతేకాదు అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే పుష్ప: ది రూల్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజై ఈ మూవీ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా, పాటలు, సిగ్నెచర్స్‌ స్టేప్స్‌ ఓ రేంజ్‌లో ఆదరణ దక్కింది.


ఈ సినిమాతోనే అల్లు అర్జున్‌ నేషనల్‌ స్టార్‌ అయ్యాడు. గతేడాది జాతీయ అవార్డుల ప్రదానొత్సవంలో పుష్ప: ది రూల్‌ సినిమాకు గానూ బన్నీ నేషనల్‌ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించాడు. దీంతో పుష్ప 2పై ఓ రేంజ్‌లో బజ్‌ నెలకొంది. షూటింగ్‌ చివరికి చేరుకున్న ఈ సినిమాను ఆగష్టు 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ గుడ్‌ న్యూస్‌ అందించింది. అప్పుడే పుష్ప 2 ఓటీటీ రైట్స్‌ను రివీల్‌ చేస్తూ మూవీని సొంతం చేసుకున్నట్టు తెలిపింది. సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ పండగా అంటూ వరుసగా కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ప్రకటించింది. ఈ క్రమంలో పుష్ప 2 డిజిటల్‌ రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ మూవీ రిలీజ్‌పై పోస్ట్‌ షేర్‌ చేసింది.


'పుష్ప 2' స్ట్రీమింగ్ అప్పుడే..!


"అతి త్వరలోనే 'పుష్ప 2' నెట్‌ఫ్లిక్స్‌లో రూల్‌ చేయబోతుంది. థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కాబోతుంది" అని ప్రకటించింది. ఇదిలా ఉంటే పుష్ప పార్ట్‌ 2 ఓటీటీ రైట్స్‌ దక్కించుకునేందుకు అమెజాన్‌ ప్రైం వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ గట్టిగా పోటీపడ్డాయట. ఈ సీక్వెల్‌ రైట్స్‌ కోసం మేకర్స్‌ భారీగా డిమాండ్‌ చేయడంతో అమెజాన్‌ వెనక్కి తగ్గిందని సమాచారం. డిమాండ్‌ మేరకు భారీగా మొత్తం చెల్లించి పుష్ప 2 ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. కాగా రూ. 30కోట్లకు సొంతం చేసుకోగా.. ఇప్పుడు సీక్వెల్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ మూడు రెట్లు అధికంగా చెల్లించిందని సమాచారం. సుమారు రూ. 100 కోట్లకు ఓటీటీ డీల్‌ జరిగినట్టు టాక్‌. 






'పుష్ప 2'తో పాటు సలార్‌, దేవర కూడా..


అంతేకాదు మరిన్ని అప్‌కమ్మింగ్‌ పాన్‌ ఇండియా, కొత్త సినిమాలపై కూడా అప్‌డేట్‌ ఇచ్చింది. 'సలార్‌', 'దేవర', 'గ్యాంగ్‌ ఆఫ్‌ గొదావరి', అల్లు శిరీష్‌ 'బడ్డి', విజయ్ దేవరకొండ 'VD13', 'డిజే టిల్లు 2' వంటి కొత్త సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇవి పోస్ట్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాతే విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో సినిమా సదరు చిత్రాల ఓటీటీ పార్ట్‌నర్‌పై అప్పుడే క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా రిలీజ్‌కు ముందే పాన్‌ ఇండియా సినిమాల ఓటీటీ పార్ట్‌నర్‌పై క్లారిటీ రావడం గమనార్హం. నిజానికి రిలీజ్‌ తర్వాత సదరు సినిమాల ఓటీటీ పార్ట్‌నర్‌పై స్పష్టత వస్తుంది. కానీ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్‌ అప్‌కమింగ్‌ పాన్‌ ఇండియా చిత్రాల స్ట్రీమింగ్‌ డిటైయిల్స్‌ వెల్లడించడం ఆసక్తిని సంతరించుకుంది. ఇవి మాత్రమే కాదు ఇంకా టైటిల్‌ ఖరారు కానీ సినిమాల పోస్టర్స్‌ కూడా వదులుతూ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.