Guntur Kaaram Blockbuster Celebrations in Mahesh Babu House: 'గుంటూరు కారం' సినిమాకు గురూజీ త్రివిక్రమ్ దర్శకుడు. అయితే... సంక్రాంతి (సోమవారం) నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో ఆ మాటల మాంత్రికుడు కనిపించలేదు. అంటే... మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆయన లేరు. దాంతో 'గురూజీ ఎక్కడ?', 'త్రివిక్రమ్ మిస్సింగ్' అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
'గుంటూరు కారం' సినిమాలో హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షి చౌదరితో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన 'దిల్' రాజుతో దిగిన ఫోటోలను మాత్రమే మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూపర్ స్టార్ ఇంటికి త్రివిక్రమ్ వెళ్లలేదా? ఒకవేళ వెళ్లినా ఆయనతో దిగిన ఫోటోలను షేర్ చేయలేదా? లేదంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరు ఏమైనా వెళ్లారా? అనేది చిత్ర బృందం చెబితే తప్ప ప్రేక్షకులకు తెలిసే అవకాశం లేదు.
త్రివిక్రమ్ రచన, దర్శకత్వంపై విమర్శలు
'గుంటూరు కారం' విడుదలైన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం మీద విమర్శలు వచ్చాయి. ఆయన స్థాయి సినిమా కాదిది అంటూ కొందరు నేరుగా విమర్శలు గుప్పించారు. మాటలు అయితే త్రివిక్రమ్ రాసినట్టు లేవని, ఆయన మార్క్ కనిపించిన సీన్లు తక్కువ అని పేర్కొన్నారు. మహేష్ బాబు పాత్రను మాస్ జనాలు మెచ్చే విధంగా మాసీగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయిన ఆయన... తన నుంచి ఆశించే సినిమా ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.
Also Read: అయోధ్య రామామందిరానికి దగ్గర్లో భూమి కొన్న అమితాబ్ - త్వరలో సొంత ఇంటి నిర్మాణం, ఎన్ని కోట్లంటే?
త్రివిక్రమే కాదు... తమన్ కూడా లేరు!
మహేష్ బాబు ఇంట జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సైతం కనిపించలేదు. బహుశా... ఆయన కూడా సంక్రాంతికి వేరే ఊరు వెళ్లి ఉండొచ్చు. అయితే... ఆయన లేకపోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు తమన్ బదులు మరొక సంగీత దర్శకుడిని తీసుకోవాలని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకు వచ్చినట్టు గుసగుసలు వినిపించాయి. వాటిలో నిజం లేదని చిత్ర బృందం ఖండించింది. 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమన్ తన బ్రదర్ అని మహేష్ చెప్పడంతో ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
Also Read: ‘మెగా’ ఇంట సంక్రాంతి సంబరాలు - ఫ్యామిలీ పిక్‌లో అకీరా, ఆద్యాలను చూసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
సినిమాపై వస్తున్న విమర్శలు పక్కన పెడితే... సంక్రాంతి బరిలో మంచి వసూళ్లు సాధిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 164 కోట్లు కలెక్ట్ చేసింది. సోమవారం సంక్రాంతి కావడంతో మంచి వసూళ్లు వచ్చినట్లు టాక్. మరి, మంగళవారం సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి? అనేది చూడాలి.