Amitabh Bachchan Buy Land: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దేశమంతా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వేడుకల్లో మునిగితేలుతుంది. ఈ క్రమంలో అయోధ్యలో బిగ్‌బి భూమి కొనుగొలు చేసినట్టుగా ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో అయోధ్యలోని భూమి రేట్లు, అమితాబ్ కొన్న స్థలం రేటు చర్చనీయాంశమైంది. కాగా మరికొద్ది రోజుల్లో అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుంది. జనవరి 22న గ్రాండ్ మందిరం ప్రారంభోత్సవ వేడుక జరుగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానం అందుతోంది. అలాగే దేశనలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులకు ఈ వేడుకకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు భారీ బందోబస్తు, ఏర్పాట్ల మధ్య అయోధ్య ముస్తాబవుతోంది. రామ మందిరం నిర్మాణంతో అయోధ్యలో రియల్ ఎస్టేట్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ ప్రాంతంలో భారీ ఆర్థిక కార్యక్రలాపాలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో అక్కడ భూముల ధరలు భారీ పలుకుతున్నాయట. దీంతో శ్రీ రాముడు నడయాడిన ప్రాంతంలో భూమి కొనుగోలు చేసేందుకు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఓ ప్లాట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అయోధ్యలో అభివృద్ది చేసిన వెంచర్ ద్వారా భూమి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్లాట్ సెవెన్ స్టార్ మల్టీ పర్పస్ ఎన్‌క్లేవ్ ది సరయూ లో ఉందట. పదివేల (10,000) చదరపు అడుగు విస్తీర్ణం భూమిని కొని అక్కడ సొంత ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నారట.
ఈ స్థలం కోసం ఆయన రూ.14.5 కోట్లు వెచ్చించినట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఈ స్థలం రామమందిరానికి 10 నిమిషాలో దూరంలో, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంకు 20 నిమిషాలు, సరయూ నదికి రెండు నిమిషాల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అయోధ్యలో ఈ వెంచర్‌ను.. ముంబైకి చెందిన డెవలపర్ ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఏబీఎల్)’ అయోధ్యలో సరయూ పేరుతో 51 ఎకరాలలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. 2028 నాటికల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ యాజమాన్యం వెల్లడించింది. తమ ప్రాజెక్టులో మొదటి ప్లాట్ ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేయడంపై ఆ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. ది హౌజ్ ఆఫ్ అభినందన్ లోధా షేర్ చేసిన బ్రోచర్‌లో అయోధ్య భూమి వివరాలు ఇలా ఉన్నాయి.
అక్కడ 1250 చదరపు అడుగల భూమి ధర రూ.1.80కోట్లు ఉండగా.. 1500 చదరపు అడుగు ప్లాట్‌ధర రూ.2.35 కోట్లుగా ఉందని పేర్కొంది. అలాగే 1750 చదరపు అడుగుల స్థలం ధర రూ.2.50 కోట్లు పలుకుతున్నట్టు సదరు సంస్థ వివరాలు వెల్లడించింది. ఇదిలా ఉంటే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, రణ్‌బీర్ కపూర్ ఆయన భార్య అలియా భట్, బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ హిరాణీ, దర్శకుడు రోహిత్ శెట్టి, సూపర్‌స్టార్ రజనీకాంత్, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్‌లకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. వారు స్వయంగా శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను వీక్షించనున్నారు.