Mega Family Sankranti Celebrations: ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్‌ ఆసక్తి ఎదురుచూస్తున్న ఆ మూమెంట్‌ వచ్చింది. ఏ పండుగైనా, ఎలాంటి సెలబ్రేషన్స్‌ అయినా మెగా-అల్లు ఫ్యామిలీ ఒకట చేరి సందడి చేస్తుంది. అలాగే ఈ సంక్రాంతికి పండుగకు ఈ స్టార్‌ ఫ్యామిలీ ఒకచోట చేరి పండుగను గ్రాండ్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్‌ చిరంజీవి తన ఎక్స్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.  ఒకే ఫ్రేంలో మెగా ఫ్యామిలీ మొత్తాన్ని చూసి ఫ్యాన్స్‌ సెలబ్రేషన్స్‌ రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఈ మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫొటోలు చూసి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. దీనికి కారణం మెగా సెలబ్రేషన్స్‌లో అకిరా, అద్యాలు కూడా భాగమవ్వడమే. దాంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ పూర్తయ్యిందంటూ‌  కామెంట్స్‌ చేస్తున్నారు. 


బెంగళూరులో మెగా సంక్రాంతి సంబరాలు


ఈసారి మెగా-అల్లు ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలకు మెగాస్టార్‌ బెంగుళూరు ఫాం హౌజ్‌ వేదికైంది. అంతా ఒక్కచోట చేరి ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. మకర సంక్రాంతికి క్రిం అండ్‌ రెడ్‌ అవుట్‌ ఫిట్‌లో మెగా ఫ్యామిలీ అంతా మెరిసిపోయింది. అబ్బాయిలు క్రిం షెర్వానీ, ఆడవాళ్లు రెడ్‌ డ్రెసుల్లో కనువిందు చేశారు. సంక్రాంతికి ఒకే ఫ్రేంలో మెగా-అల్లు ఫ్యామిలీని చూసి అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇందులో అకిరా,ఆద్యాలు కూడా చేరడంతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ సెలబ్రేషన్‌ డబుల్‌ అయ్యింది. పవన్‌ కూడా ఉండి ఉంటుంది మెగా పూర్తయ్యేంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 






వింటెజ్‌ పవన్‌ దొరికాడు.. అకిరా లుక్‌పై


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నట వారసుడిగా అకిరా నందన్‌ సినీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అకిరా ఎప్పుడు కనిపించిన అభిమానుల నుంచి ఇదే ప్రశ్నలు వినిపిస్తుంటాయి. అకిరా కటౌట్‌ లుక్‌పై ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అరడుగుల పొడవుతో అచ్చం తండ్రి పోలికలతో ఉండే అకిరా సినిమాల్లో వస్తే మెగా ఫ్యామిలీకి మరో బ్లాక్‌బస్టర్‌ హీరో దొరికేసనట్టేనని సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటుంటారు. అందుకే అకిరా డెబ్యూ ఎప్పుడెప్పుడా అని కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దానికి ఇంకా టైం పట్టేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో మెగా ఫ్రేంలో అకిరా నందన్‌ లుక్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయ్యింది. అచ్చం పవన్‌ లుక్‌ను అకిరా దించెశాడు అంటున్నారు. గుబురు జుట్టూ, గడ్డం,మీసంతో అచ్చం తండ్రిని పోలి ఉన్నాడు. 


పవన్‌ యంగేజ్‌లోని లుక్‌ను, ఇప్పుటి అకిరా లుక్‌ పోల్చుతూ ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇలా అకిరాను చూసి వింటేజ్‌ పవన్‌ కళ్యాణ్‌ దొరికేశాడు అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అకిరా, ఆద్యాల వీడియో పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ షేర్‌ చేశారు. అకిరా, అద్యాల ఫొటోకు అన్నవరం సినిమాలోని అన్నచెల్లెల సెంటిమెంట్‌తో సాగే పాటను జత చేసి వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు కూడా నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. దీంతో ప్రస్తుతం ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం చూసి మెగా ఫ్యామిలీ ఫొటోలు, అకిరా,అద్యాల వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. 


Also Read: ‘గుంటూరు కారం’ ౩వ రోజు కలెక్షన్స్‌ - ఎన్ని కోట్లు రాబట్టిందంటే!