Gruhalakshmi Serial Today Episode: అనసూయ వచ్చి లాస్యను తిడుతుంటే.. ఇదే కాదు నీ మొగుణ్ణి హిప్నటైజ్‌ చేయించి ఇలా మార్చిందే నేను. ఆ డాక్టర్‌ నేను ఏది చెబితే అది చేస్తాడు. అంటూ మొత్తం చెప్పేస్తుంది లాస్య. అనసూయ షాక్‌ అవుతుంది. వెంటనే నీ బండారం మొత్తం నందుకు చెబుతాను. వాడొచ్చాడంటే నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు అంటూ నందాకు ఫోన్‌ చేయబోతుంటే..


లాస్య: చెయ్‌ నీ మంగళసూత్రాల మీద ఆశ లేకపోతే చెయ్‌. డాక్టర్‌ ఏం చెప్పాడు మామయ్య బ్రమతో పాటే మనం కూడా నడుచుకోవాలని చెప్పాడు కదా.. కాదు కూడదు.. అంటే ఇప్పుడు నన్ను ఇంట్లోంచి తరిమేస్తే జరగబోయేది ఎంటో తెలుసా? నీ మొగుడి గుండె ఆగి హుష్‌ ..


అంటూ లాస్య బెదిరించగానే అనసూయ భయపడిపోతుంది. ఏడుస్తూ ఉండిపోతుంది. మరోవైపు విక్రమ్‌ వాళ్ల ఇంట్లో అందరూ ఎస్సై కోసం ఎదురుచూస్తుంటారు.


రాజ్యలక్ష్మీ: ఏంటి నాన్నా ఎస్సై గారు ఫోన్‌ చేశారు అన్నావు. యాక్సిడెంట్‌ అయిన అమ్మాయిని తీసుకొస్తున్నారు అన్నావు. ఇంతవరకు రాలేదు ఏంటి?


బసవయ్య: పోలీసులు కూడా భ్రమ పడ్డారేమో అక్కాయ్‌.


రాజ్యలక్ష్మీ : శుభవార్త వినాలని అందరం ఎదురుచూస్తుంటే.. ఆ అపశకునం కూతలేంటి?


  అంటూ రాజ్యలక్ష్మీ బసవయ్యను తిట్టినట్లు నాటకం ఆడుతుంది. బసవయ్య ఏదో అలవాటులో పొరపాటుగా నోరు జారిందని చెప్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి దివ్యను అరెస్ట్‌ చేయడానికి వచ్చామని వారెంట్‌ చూపిస్తారు. దీంతో దివ్య, విక్రమ్‌ షాక్‌ అవుతారు. రాజ్యలక్ష్మీ, బసవయ్య, లోపల సంతొషంగా ఫీలవుతారు. దివ్యను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని విక్రమ్‌ అడుగుతే యాక్సిడెంట్‌ కేసులో అమ్మాయి చనిపోయిందని అందుకే చేస్తున్నామని చెప్తారు. దివ్యను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే.. తులసి, నంద, రాములమ్మ చందనను తీసుకుని వస్తారు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. విక్రమ్‌ వాళ్ల నాన్న ఈ అమ్మాయి చనిపోయిందని అన్నారు ఎలా బతికింది అని అడగ్గానే తులసి మొత్తం జరిగిన విషయం చెబుతుంది. దివ్య కోపంగా చందనను కొట్టి నిజం చెప్పమని అడుగుతుంది.


దివ్య: ఎందుకు చేశావు? ఎందుకు చేశావు ఇలా.. చెప్పు


ఇప్పుడిది నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఎంటి? అని రాజ్యలక్ష్మీ మనసులో అనుకుంటూ భయపడుతుంది. విక్రమ్‌ ఏమాత్రం జాలి లేకుండా నన్ను బయటకు గెంటేస్తాడు. అనుకుంటూ చందనకు డబ్బులిస్తానని నిజం చెప్పొద్దని సైగ చేస్తుంది. చందన దివ్య కాళ్లపై పడి క్షమాపణ అడుగుతుంది.


దివ్య: క్షమించడం కాదు ఈ పని ఎందుకు చేశావు. ఎవరు చేయించారు నాకు తెలియాలి. ఇప్పుడే తెలియాలి.. ఇక్కడే తెలియాలి చెప్పు


అంటూ చందన గొంతు పట్టుకుని అడుగుతుంది దివ్య.


బసవయ్య: అమ్మా వదులమ్మా గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. అనవసరంగా కేసు అవుతుంది.  


విక్రమ్‌: అవ్వనివ్వండి మామయ్యా నేను చూసుకుంటాను. దివ్య దాని మెడ వదలకు నిజం చెప్పేదాకా వదలకు


అంటూ విక్రమ్‌ చెప్పగానే గోవిందా గోవిందా.. ఇక మా అక్కకు చిప్పకూడు తప్పదు. అని బసవయ్య మనసులో అనుకుంటాడు. రాజ్యలక్ష్మీ ఎస్సైకి సైగ చేస్తుంది. ఏదో ఒకటి చేయమని


ఎస్సై: సార్‌ విక్రమ్‌ గారు అమ్మాయి దొరికింది. తప్పు చేసినట్లు ఒప్పుకుంది మా చేతికి అప్పజెప్తే.. చట్టప్రకారం చేయాల్సింది చేస్తాం.


తులసి: చట్టప్రకారం ఏం చేస్తారు ఎస్సై గారు. ఆ అమ్మాయిని వెతకమంటే అసలు అలాంటి మనిషి జనాభా లెక్కల్లోనే లేదు అన్నారు కదా?


అనగానే మేము కూడా మనుషులమే అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అని ఎస్సై చెప్పగానే.. బతికున్న మనిషిని చనిపోయింది అనడం చిన్న పొరపాటా? ఒక నిర్ధోషికి ఉరిశిక్ష వేయడానికి తీసుకెళ్లడం చిన్న పొరపాటా? సమయానికి మా అత్తయ్య ఆ అమ్మాయిని తీసుకురాకపోతే పరిస్థితి ఏంటి? అంటూ విక్రమ్‌ బాధపడతాడు. ఇంతలో తులసి... బసవయ్య, ప్రసూనాంబను దగ్గరకు పిలిచి దివ్యను ఏ విధంగా అయితే స్టోర్‌ రూంలో వేశారో అలాగే ఈ అమ్మాయిని కూడా స్టోర్‌ రూంలో వేసి నిజం చెప్పేవరకు అన్నం పెట్టొద్దు అని చెప్తుంది. దీంతో చందన డబ్బు కోసమే ఇలా చేశానని చెప్పడంతో విక్రమ్‌ అరెస్ట్‌ చేయమని చెప్తాడు. పోలీసులు దివ్యను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తారు. మరోవైపు అనసూయ ఇంట్లో ఒక్కతే కూర్చుని లాస్య అన్న మాటలు గుర్తు  చేసుకుంటూ బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: అయోధ్య రామ మందిరానికి దగ్గర్లో భూమి కొన్న అమితాబ్‌ - త్వరలో సొంత ఇంటి నిర్మాణం, ఎన్ని కోట్లంటే?