Telugu News: హిందూపురం టార్గెట్‌గా మంత్రి పెద్దిరెడ్డి రాజకీయాలు - వారం రోజులు అక్కడే మకాం !హిందూపురం నియోజకవర్గంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏకంగా ఆరు రోజుల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ నేతలను ఏకం చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే వారు ఎవరైనా ఉంటే చేర్చుకోనున్నారు. ఆరు రోజుల పాటు హిందూపూర్ నియోజకవర్గం పరిధిలోని 36 పంచాయతీల్లో పర్యటించనున్నారు. మొదటి రోజు చౌళూరు, తూముకుంట, గోళ్లాపురం, సంతేబిదనూరు, కోటిపి, కిరికెర, బేవినహళ్ళి పంచాయతీలో మంత్రి పర్యటన సాగుతుంది. చౌళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గులాబీ బాస్ రిటర్న్ బ్యాక్ సూన్ - పార్లమెంట్ కు అభ్యర్థుల ఎంపికపై BRS వ్యూహం ఏంటి?హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. తుంటి ఎముకకు ఆపరేషన్ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గత కొద్ది రోజులుగా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖమంత్రి జగన్ ఇలా పలువురు ముఖ్య నేతలు కేసీఆర్ ను పరామర్శించారు. అయితే కేసీఆర్ ను అంటి పెట్టుకుని ఉండే ఎంపీ సంతోష్ the leader is back and ready to make waves అన్న క్యాప్షన్ తో కేసీఆర్ కూర్చుని నమస్కరించే ఫోటోను తన ట్విట్టర్ లో పెట్టారు. ఇటీవలే మాజీ మంత్రి, బీఆర్ఎస్ టాప్ లీడర్ హరీశ్ రావు సైతం ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జులను నియమించిన బీజేపీపార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ సమాయత్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించింది పార్టీ అధినాయకత్వం. ఆదిలాబాద్-పాయల్ శంకర్, పెద్దపల్లి-రామారావు, నిజామాబాద్- ఆలేటి మహేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్- వెంకటరమణారెడ్డి, మెదక్- హరీష్‌బాబు, కరీంనగర్-ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మల్కాజ్‌గిరి- రాకేష్ రెడ్డిసికింద్రాబాద్- లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టిక్కెట్ల మార్పు రివర్స్ అవుతుందా ? కల్యాణదుర్గం వైఎస్ఆర్‌సీపీలో టెన్షన్అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీలో నేతల మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) రెండు జాబితాలను విడుదల చేశారు. ఇందులో అనంతపురం జిల్లాలోనూ ఎమ్మెల్యేల మార్పులు చోటుచేసుకున్నాయి. స్త్రీ శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంకు.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంకు అనంతపురం ( Anantapur ) ఎంపీ తలారి రంగయ్య ను నియమించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సింగనమల ఎమ్మెల్యే తిరుగుబాటు- నియోజకవర్గానికి నీళ్ల కోసం పోరుబాటవైఎస్‌ఆర్‌సీపీలో అధినాయకత్వానికి ఒకరి తర్వాత ఒకరు షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫైర్ అయ్యారు. ఎస్సీ నియోజకవర్గమనే చిన్నచూపు అంతటా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురం జిల్లా వైసీపీలో మరో ముసలం పుట్టింది. తన నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వెళ్తున్నాయని తమ నియోజకవర్గంలోని ప్రాంతాలు బీడుగా మారుతున్నాయని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి