Kalyanadurgam YSRCP candidate Rangaiah :   అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీలో నేతల మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) రెండు జాబితాలను విడుదల చేశారు. ఇందులో అనంతపురం జిల్లాలోనూ ఎమ్మెల్యేల ( MLA  ) మార్పులు చోటుచేసుకున్నాయి. స్త్రీ శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంకు..  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంకు అనంతపురం (  Anantapur )  ఎంపీ తలారి రంగయ్య ను నియమించారు. ఒకే  పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయంగా వీరిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉండేవారు. 


కల్యాణదుర్గం టిక్కెట్ ఎంపీ రంగయ్యకు కేటాయింపు


అనంతపురం ఎంపీ రంగయ్య, కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌లకు రాజకీయంగా వివాదాలున్నాయి.   ఇద్దరు ఒకే పార్టీ అయిన మంత్రి ఉష శ్రీ చరణ్ కు ఎంపీ తలారి రంగయ్య కు సరిపోయేది కాదు. కళ్యాణదుర్గం నియోజకవర్గం లో రెండు వర్గాలుగా నేతలు కార్యకర్తలు గతంలో విడిపోయారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు లక్ష్యంగా నియోజకవర్గ నేతలను మారుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ తప్పించి అనంతపురం ఎంపీ రంగయ్యకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. 


మంత్రి వర్గం రంగయ్యకు సహకరిస్తుందా ? 


కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా కళ్యాణ్ దుర్గం ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీకి పట్టం కట్టారు. ఇక్కడి నుంచి మంత్రి ఉష శ్రీ చరణ్ ను భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ నియోజకవర్గంలో కురుబలు, బోయ లు ఎక్కువగా ఉంటారు. నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ కు   వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. ముఖ్యమంత్రి సర్వేలలో ఈ సారి టికెట్ ఉషశ్రీకే కేటాయిస్తే గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలింది. దీంతో బోయ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన రెండో జాబితాలో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ఇన్చార్జిగా తలారి రంగయ్యను అవకాశం కల్పించారు.


వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై - కారణం ఇదేనంటూ ట్వీట్!


కల్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి రంగయ్య ప్రయత్నాలు


 మొదటి నుంచే తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఏ నియోజకవర్గంలోనూ ఏ ఎమ్మెల్యే తోను వివాదాల లేకుండా అందర్నీ కలుపుకొని  రాజకీయం చేేసవారు.   ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గం లో మాత్రమే ఎంపీ రంగయ్య వర్గం మంత్రి ఉషశ్రీ వర్గం అని నేతలు కార్యకర్తలు విడిపోయారు. ఒకానొక సందర్భంలో ఇరువర్గాలు ఒకరికి తెలియకుండా ఒకరు రహస్య సమావేశాలు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నియోజకవర్గ బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కు అప్పగించడంతో మంత్రి ఉషశ్రీ చరణ్ వర్గం రంగయ్యకు సహకరిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పార్టీ గెలవాలంటే నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవాల్సి ఉంటుంది. తనకు వ్యతిరేక వర్గంగా పనిచేసిన నేతలను ఎంపీ రంగయ్య ఇప్పటికే పిలిపించుకొని మాట్లాడినట్లు సమాచారం. 


టమోటోకి, పొటాటోకి తేడా తెలియని జగన్ వ్యవసాయం చేస్తాడా? - చంద్రబాబు ఎద్దేవా


వర్గాలుగా విడిపోతే గెలుపుపై ప్రభావం


వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆ సమావేశాల్లో ఎంపీ రంగయ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.ఇక్కడ వర్గాలు ముఖ్యం కాదు.. వచ్చె ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం వచ్చెందుకు ప్రతి ఒక్కరు కృషి చేయలని నియోజకవర్గ సమన్వయకర్త అనంతపురం ఎంపి తలరి రంగయ్య నాయకులను, కార్యకర్తలను మండలాల వారిగా కలుపుకోని ముందుకు సాగుతున్నారు. పైకి అందరూ ఒక్కటిగా ఉంటున్నప్పటికీ అంతర్గతంగా వీరు రంగయ్యకు సహకరిస్తారా లేక రంగయ్య కు వ్యతిరేక వర్గంగానే కొనసాగుతారా అన్నది తెలియాల్సి ఉంది.