2024 Ranju Trophy: దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం సారధి రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలిన అస్సాం ఫాలో ఆన్ ఆడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది.
రియాన్ పరాగ్ తన జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి, 3 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. అస్సాం సెకెండ్ ఇన్నింగ్స్‌లో త్వరగా అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం రియాన్, ఆకాశ్‌సేన్ గుప్తా (3) క్రీజ్‌లో నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ అమన్‌దీప్ దేశాయ్ సెంచరీ చేయడంతో చత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుస్సేన్, మ్రిన్‌మోయ్ దత్తా, ఆకాశ్‌సేన్ గుప్తా, రాహుల్ సింగ్, కునాల్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు.
శతక్కొటిన పడిక్కల్, మనీశ్‌పాండే
రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. సీనియర్ బ్యాటర్లు, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు, యువ క్రికెటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ శతకంతో చెలరేగాడు. కేవలం 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్లతో 193 పరుగులు చేసి సత్తా చాటాడు. మనీశ్ పాండే సైతం మెరుపు శతకంతో టీమిండియా తలుపు తట్టాడు. కేవలం 165 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో మనీశ్ పాండే 118 పరుగులు చేశాడు. మరో యువ బ్యాటర్ శ్రీనివాస్ శరత్ కూడా 76 పరుగులతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 514 పరుగుల వత్తా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా.. ఓపెనర్ ఆర్ సమర్థ్ 38 త్వరగానే అవుటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేరిత్ దత్, నమన్ ధిర్ తలో 2 వికెట్లు, సిదార్థ్ కౌల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (85), ప్రభసిమ్రన్ సింగ్ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్ ఒక్కవికెట్ కూడా నష్టపోకుండా 169 పరుగులు చేసి ధీటుగా స్పందిస్తోంది.
పుజరా ద్వి శతకం
స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాటర్ అయిన పూజారా 243 రన్స్‌తో విరుచుకుపడ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ వైఫల్యంతో జట్టుకు దూరమైన నయావాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశతకం నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్టర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌలర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డబుల్ సెంచరీ బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరో సౌరాష్ట్ర ఆటగాడు ప్రేరక్ మన్కడ్ కూడా శతకం చేయడంతో సౌరాష్ట్ర 5784 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నయావాల్ Pujara ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశతకం నమోదు చేశాడు.