Telugu News 03 January 2024: కుటుంబాలను చీల్చే కుట్రలు చేస్తున్నారు - కాకినాడ సభలో జగన్ వ్యాఖ్యలు
రాబోయే రోజుల్లో కుట్రలు, కుటుంబాల్ని చీల్చే రాజకీయాలు చేస్తారని సీఎం జగన్ ఆరోపణలు చేశారు. మరిన్ని పొత్తులు పెట్టుకుంటారని తెలిపారు. పొత్తుల కోసం కుటుంబాలను చీలుస్తారని అన్నారు. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతుల తీసుకునేందుకు సిద్దమైన సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది. చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదన్నారు. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్‌నరే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నేటి నుంచి బీఆర్‌ఎస్ వరుస సమావేశాలు- లోక్‌సభ ఎన్నికలకు వ్యూహరచన
అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమి చవిచూసిన గులాబీ పార్టీ... పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. అత్యధిక ఎంపీ స్థానాలను కైవశం చేసుకునే పనిలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా... వరుస సమావేశాలు నిర్వహిస్తూ... పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా... నేటి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్ (BRS) పార్టీ. ఈ సమావేశాలు ఈనెల 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం (Adilabad Lok Sabha Constituency) పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం ఏర్పా టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రేపు ఢిల్లీకి రేవంత్- నేడు కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. మరోసారి ముఖ్యమంత్రి(Chief Minister) ఢిల్లీ వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే గురువారం వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSR Telangana Party) అధ్యక్షురాలు షర్మిల(Sharmila) కాంగ్రెస్(Congress)లో జాయిన్ అవుతున్నారు. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లనున్నారని ఓ టాక్ ఉంది. ఇదే టైంలో ఆయన ఇంకా పెండింగ్‌లో ఉన్న మంత్రిమండలి(Telangana Cabinet) విస్తరణ, నామినేటెడ్ పదవులు భర్తీపై కూడా అధినాయకత్వంతో చర్చిస్తారనే ప్రచారం నడుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీ రెండో లిస్ట్‌లో వారసుల హవా- లేదు లేదు అంటూనే పెద్ద పీట
మొన్న 11 ..ఇప్పుడు 27 మొత్తం 38 సీట్లకు ఇంచార్జులను ప్రకటించింది వైసీపీ(YCP). చివరి నిమిషంలో మార్పులు లేకుంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసేది వీళ్లే. గతంలో జగన్ పూర్తిగా తన ఇమేజ్ మీదనే 151 మంది ఎమ్మెల్యేల(MLAs)ను..22 మంది ఎంపీల(MPs)ను గెలిపించారని వైసీపీ క్లెయిమ్ చేసుకుంటూ వస్తోంది. ఈసారి ఆ ఇమేజ్‌కు తోడుగా సంక్షేమ పథకాల అమలు జోడిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే 175 కు 175 సీట్లు గెలుస్తాం అంటూ స్వయంగా పార్టీ అధినేత జగన్(Jagan) పదేపదే చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అచ్చెన్నాయుడుపై ఐఏఎస్..! ఇచ్ఛాపురంలో పోటీకి మహిళా నేత...! శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ వ్యూహం ఇదే...!
వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అభ్యర్థులను మార్చుకుంటూ వెళుతోంది. ఒకేసారి 25మంది ఇన్‌చార్జ్‌లను మార్చిన పార్టీ మరికొంతమందిని మార్చేందుకు సిద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లా(Srikakulam)లో తెలుగుదేశం(Telugu Desam) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)పై ఓ ఐఏఎస్(IAS)ను బరిలోకి దింపాలనుకుంటోంది. దాదాపు 65 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పులు ఉంటాయని చెప్పిన దానికి అనుగునంగానే వరుసగా వైసీపీ(YSRCP) నుంచి జాబితాలు వస్తున్నాయి. చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి