CM Jagan Speech :  రాబోయే రోజుల్లో కుట్రలు, కుటుంబాల్ని  చీల్చే రాజకీయాలు చేస్తారని సీఎం జగన్ ఆరోపణలు చేశారు. మరిన్ని పొత్తులు పెట్టుకుంటారని తెలిపారు. పొత్తుల కోసం కుటుంబాలను చీలుస్తారని అన్నారు. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతుల తీసుకునేందుకు సిద్దమైన సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది.  


చంద్రబాబు అవినీతిలోనూ పవన్ పార్టనర్                                       


చంద్రబాబు, పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదన్నారు.   పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కూడా పార్ట్‌నరే.  అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్‌నర్‌ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడని విమర్శించారు. 


చంద్రబాబు పాలనలో వెయ్యే పెన్షన్                      


చంద్రబాబు పాలనలో పెన్షన్‌ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనన్నారు.  ఎన్నికల ముందు  జగన్‌ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్‌ పెంచేవాడు కాదన్నారు. అర్హత ఉంటే చాలు అందరికీ పెన్షన్‌ ఇస్తున్నామన్నారు.  చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్‌ రూ.58వేలు మాత్రమే ఇచ్చారు. గతానికి, ప్రస్తుతానికి   తేడాను గమనించాలని  జగన్  కోరారు.  ప్రస్తుతం  రూ.లక్షా 47వేలు అందిస్తున్నామన్నారు.  గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించే వారు. చంద్రబాబు హయాంలో పెన్షన్‌ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని విమర్శించారు. 


పార్టీలకు అతీతంగా అందరికీ పెన్షన్                                       


ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్‌ పెంచామని  కాకినాడలో సీఎం జగ్ ప్రకటించారు.  పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. కాకినాడలో పించన్లు పెంచేందుకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.   66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్‌ అందిస్తున్నామని..   పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.  పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నామన్నారు.   గతంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చారు. ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్‌ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్‌ను పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నాం. బాబు నెలకు రూ.400కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రూ.2వేల కోట్లు ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్‌ అందజేస్తున్నామని తెలిపారు.