Love Jihad Law : మారుతున్న కాలంతో పాటు.. కొన్ని సెక్షన్లు కూడా ప్రజలను ఉద్దేశించి.. వారి శ్రేయస్సు మేరకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సెక్షన్ల గురించి కొందరికి సరైన అవగాహన లేక.. అసలు దీని గురించే తెలియక చాలా మంది తమకు జరగాల్సిన న్యాయాన్ని పొందలేకపోతున్నారు. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే యూత్​కి కూడా కొన్ని సెక్షన్లు తెలియడం లేదు. కానీ వాటి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అలా ప్రస్తుతం యూత్​ తెలుసుకోవాల్సిన సెక్షన్ 69. దీని గురించి అమ్మాయిలు, అబ్బాయిలు కచ్చితంగా తెలుసుకుంటే చాలా మంచిది. 


అలాంటివారి కోసమే ఈ సెక్షన్


న్యూ జెన్​లో లవ్, రిలేషన్స్, బ్రేకప్స్ వంటి విషయాలు చాలా కామన్​గా మారిపోయాయి. కొందరు మ్యూచువల్ అండర్​స్టాండింగ్​తో రిలేషన్ మెయింటైన్ చేస్తే మరికొందరు నిజమైన ప్రేమ అనుకుంటూ రిలేషన్​లోకి వెళ్తున్నారు. శారీరక లాభాలకోసం ప్రేమ పేరుతో దగ్గరవుతూ.. అవసరం తీరిపోయాక మొహం చాటేసే వారు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారి గురించే ఈ ఐపీసీ 69 రూపొందించారు. 


అవే ప్రూవ్స్..


ఎవరైనా అబ్బాయి ప్రేమ పేరుతో అమ్మాయికి దగ్గరై.. పెళ్లి చేసుకుంటాను అంటూ శారీరకంగా దగ్గరై.. ఆ మాటను నిలబెట్టుకోలేక పోతే.. ఆ అబ్బాయికి ఈ సెక్షన్ కింద శిక్షపడుతుంది. పదేళ్లు జైలు శిక్షను అనుభించడం లేదా జరిమానా విధిస్తారు. పరిస్థితులను బట్టి జరిమానా తెలుస్తుంది. కొన్ని పరిస్థితుల్లో జైలు, జరిమానా రెండూ పడొచ్చు. ఈ కేసులో అబ్బాయి అమ్మాయికి పంపే మెసేజ్​లలో, వాయిస్ నోట్స్​ లేదా కాల్ రికార్డింగ్స్​ను ప్రధానమైన ప్రూవ్స్​గా పరిగణిస్తారు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి.. చేసుకోని పక్షంలో అబ్బాయికి ఈ శిక్షను విధిస్తారు. 


అమ్మాయిలకు ఊరటనిస్తుంది..


ఈ మధ్యకాలంలో ఇలాంటి తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఇలాంటి సెక్షన్​ను తెరపైకి తీసుకువచ్చారు. అబ్బాయిల చేతిలో శారీరకంగా మోసపోతున్న అమ్మాయిలకు ఈ సెక్షన్ మంచి ఊరటనే ఇస్తుందని చెప్పాలి. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోభరుచుకునే అబ్బాయిలకు ఇది కచ్చితంగా భయం కలిగిస్తుంది. అలాగే ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని శారీరకంగా దగ్గరై.. తర్వాత అతను మొహం చాటేస్తే ఏమి చేయాలో తెలియక ఇబ్బందిపడే అమ్మాయిలకు ఈ సెక్షన్ కాస్త ఊరటనిస్తుంది. 


మాకు ఓ సెక్షన్ కావాలి..


ప్రస్తుతం తెరపైకి వచ్చిన ఈ సెక్షన్ 69 గురించి అబ్బాయిలు మాట్లాడుతూ.. తమకి ఇలాంటి సెక్షన్​ను తీసుకురావాలని సోషల్ మీడియాలో చెప్తున్నారు. మమ్మల్ని మానసికంగా క్షోభకు గురిచేసి.. మనసారా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని ఆశలు చూపించి.. చివరకు మమ్మల్ని వదిలేసి తల్లిదండ్రులు చూపించే అబ్బాయిని చేసుకునేవారిపై కూడా ఇలాంటి సెక్షన్ ఒకటి తీసుకురావాలని సోషల్ మీడియాలో అబ్బాయిలు వీడియోలు పెడుతున్నారు. 


ప్రేమలో ఉంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారి రిలేషన్​ గురించి క్లారిటీగా ఉండడం మంచిది. వారు ప్రేమలో ఉన్నా.. రిలేషన్​లో ఉన్నా దాని గురించి ఇద్దరూ ఓపెన్​గా డిస్కస్​ చేసుకుంటే వారి రిలేషన్ స్ట్రాంగ్​గా ఉంటుంది. ప్రేమ పేరుతో మిమ్మల్ని ఇతరులు మోసం చేసే అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రేమలో ఉన్నప్పుడు శారీరకంగా దగ్గరవ్వాలని ఎలాంటి రూల్​ లేదు. ఈ విషయంలో అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా కాస్త జాగ్రత్త వహిస్తే ఎలాంటి సెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. 


Also Read : కొవిడ్ జెఎన్ 1 వైరస్ కొత్త లక్షణాలు ఇవే.. నివేదించిన వైద్యులు