ఎలన్ మస్క్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టెస్లా కార్ల కంపెనీ సీఈవో, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఇప్పుడు ఎలన్ మస్క్ కు మరో గుర్తింపు లభించింది. టైమ్ మ్యాగజైన్ ఎలన్ మస్క్ ను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021' గుర్తించింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడికి సొంత ఇల్లు లేదు.. ఇటీవల తన షేర్లను అమ్ముకుంటున్నాడు అని టైమ్ మ్యాగజైన్ ఎలన్ మస్క్ గురించి రాసుకొచ్చింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలన్ మస్క్ 266 బిలియన్ల డాలర్లతో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారని పేర్కొంది. గతేడాది ఈ టైటిల్ ను అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పొందారు. వారి వద్ద నుంచి ఎలాన్ మస్క్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
"ఎలన్ మస్క్.. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాడు. గ్యాస్, డ్రైవర్ అవసరం లేని కారును కనిపెట్టాడు. చేతి కదలికతో స్టాక్ మార్కెట్ గతిని మార్చగలడు. అతని ప్రతి మాటను వేదంగా ఆచరించే పాలోవర్స్ ఉన్నారు. అతను అంగారక గ్రహంపై అడుగుపెట్టాలని కలలు కంటాడు"అని టైమ్ మ్యాగజైన్ కోట్ చేసింది. సోలార్, క్రిప్టోకరెన్సీ, క్లైమేట్, బ్రేన్-కంప్యూటర్, కృత్రిమ మేధస్సు, భూగర్భ సొరంగాలు, సూపర్ స్పీడ్ సరకు రవాణా ఇలాంటి ఎన్నో ఆలోచనలతో ముందుకు సాగుతున్న వ్యక్తి అని టైమ్ పత్రిక పేర్కొంది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడికి సొంత ఇల్లు లేదని పేర్కొంది. డిసెంబర్ 2న కాలిఫోర్నియాలోని తన ఇంటిని 30 మిలియన్ డాలర్లకు విక్రయించాడు మస్క్.
Also Read: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్ పోల్
సొంత ఇళ్లు లేని మస్క్
డైలీ మెయిల్ ప్రకారం సిలికాన్ వ్యాలీ మాన్షన్ ను మస్క్ 37.5 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. కానీ చివరకు 7.5 మిలియన్ డాలర్ల తక్కువగా విక్రయించాడు. ఎలన్ మస్క్ ప్రారంభించిన స్టార్టప్ రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్.. ఇప్పుడు అమెరికా అంతరిక్ష ప్రయాణాన్ని సొంతం చేసుకునేందుకు బోయింగ్ తో పోటీపడుతోంది. మస్క్ కార్ల కంపెనీ టెస్లా.. అది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో మూడింట రెండు వంతుల నియంత్రణ చేస్తుంది. టెస్లా విలువ 1 ట్రిలియన్ డాలర్లు. 250 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనికుడిగా నిలిచాడని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.
హీరోస్ ఆఫ్ ది ఇయర్ 2021
కోవిడ్ టీకాలు కనిపెట్టిన శాస్త్రవేత్తలను "హీరోస్ ఆఫ్ ది ఇయర్ 2021" అని టైమ్ మ్యాగజైన్ సోమవారం ప్రకటించింది. కవర్ ఇమేజ్‌లో కటాలిన్ కారికో, బర్నీ గ్రాహం, కిజ్‌మెకియా కార్బెట్, డ్రూ వీస్‌మాన్ ఫొటోలు ఉంచింది. వీరు నలుగురు కోవిడ్-19 మహమ్మారి వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర వహించారు. mRNA సాంకేతికతతో డాక్టర్ కారికో, డాక్టర్ వీస్‌మాన్ ఫైజర్-మోడర్నా కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు.
Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్
Also Read: ఈ బ్యాంకు హోమ్ , కార్ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి