Breaking News: సెప్టెంబర్ 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 14న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 14 Sep 2021 08:55 PM
సెప్టెంబర్ 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్ సెప్టెంబర్ 16న సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు, నిర్వహణపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 25లోగా ఉభయసభలు సమావేశం కావాల్సి ఉంది. ముఖ్యంగా దళిత బందు పథకంపై చర్చ జరగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంటల సాగు, వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం లాంటి అంశాలపై, ఉద్యోగాల భర్తీ అంశంపై సైతం రాష్ట్ర మంత్రి మండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సైదాబాద్ సింగరేణి కాలనీ.. చిన్నారి హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్ ప్రకటన

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార నిందితుడిపై రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ అందిస్తామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. పోలీసులు నిందితుడి ఆనవాళ్లను విడుదల చేశారు.

టీటీడీ పాలక మండలి ఖరారు.. తెలంగాణ‌ నుంచి అయిదుగురికి చోటు..

టీటీడీ కొత్త పాలక మండలి ఖరారైంది. మొత్తం 25 మంది సభ్యులలో తెలంగాణ నుంచి ఐదుగురు, తమిళనాడు నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సేవాభావం కలిగిన మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల

 


హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. కాలర్ బోన్‌ సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తాజాగా అపోలో ఆసుపత్రి వర్గాలు సాయి ధరమ్ తేజ్‌ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశాయి. తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. చికిత్సలో భాగంగా వెంటిలేటర్‌ అవసరాన్ని తగ్గిస్తున్నామన్నారు. బయోమెడికల్ పరీక్షలు సంతృప్తికరంగా ఉన్నాయన్న వైద్యులు... ప్రత్యేక వైద్యుల బృందం అబ్జర్వేషన్‌లో ఉన్నారని తెలిపారు. 

జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలి: రఘురామ

హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపంది.

ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ విచారణ

ఏపీ సీఐడీ ఎదుట హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌ హాజరయ్యారు. ఫైబర్‌ నెట్‌ కేసులో ముగ్గురికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని సీఐడీ ముందుగా నోటీసులు ఇచ్చింది. మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణ జరుగుతోంది. విజయవాడ సత్యనారాయణపురంలో సీఐడీ ఎదుట సాంబశివరావు హాజరయ్యారు. 


 

ఏపీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

 అయ్యింది. కమిటీ ముందు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. గత విచారణకు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకాలేదు. గతంలో వ్యక్తిగత కారణాల వద్ద హాజరు కాలేనని అచ్చెన్నాయుడు కమిటీకి సమాచారం ఇచ్చారు. 

అపోలో ఆస్పత్రికి వెళ్లిన రెబల్ స్టార్ కృష్ణంరాజు

రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆస్పత్రికి వెళ్లారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చారు. సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు చెప్పారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్టు తెలుస్తోంది.

కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్ సీ నారాయణ లేఖ

 శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం కుడిగట్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ  నారాయణ రెడ్డి లేఖ రాశారు. మూడు, నాలుగు రోజుల్లో  శ్రీశైలం జలాశయానికి మిగులు జలాలు రానున్నందున విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కోరారు. 

ఫైబర్ నెట్ అవకతవకలపై ముగ్గురికి నోటీసులు.. ఇవాళ విచారణ

ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంపై సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. వారిని ఇవాళ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వేమూరి హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఫైబర్‌ నెట్‌లో రూ.320 కోట్లకి టెండర్లు పిలిస్తే రూ.121 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ నివేదికలో పేర్కొంది.  ఓ ప్రైవేట్ సంస్థకు టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగాయని పేర్కొంది. 

నిమజ్జనంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!

హుస్సేన్ సాగర్ లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై  తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనుంది. సీఎం కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిమజ్జనం ఆంక్షలపై ఇచ్చిన తీర్పును సవరించాలన్న హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు, తదుపరి కార్యాచరణ, ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల సమీక్షలో చర్చించారు. 


 


 

సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దైంది. ఈ నెల 17న ఆయన యాదాద్రిలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. చివరి నిముషంలో పర్యటన రద్దైంది. ఈ పర్యటనలో యాదాద్రి దేవాలయం నిర్మాణ పనులను  సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 

కోవూరులో కల్వర్టును ఢీకొట్టిన కారు...మామ, కోడలు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మామ, కోడలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరులోని హరినాథపురానికి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడిని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న హాస్టల్‌లో చేర్పించి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కోవూరులోని ఏసీసీ కల్యాణ మండపం వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో పార్లపల్లి సుధాకర్‌రావు(76), అరుణ(30) అక్కడికక్కడే మృతిచెందారు. ఆ వ్యక్తితో పాటు అతడి తల్లికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 14న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.