Mahindra Thar Roxx Price: మహీంద్రా థార్ రోక్స్ ఆగస్ట్ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ను కూడా మహీంద్రా ప్రారంభించింది. థార్ రోక్స్ బుకింగ్ ప్రారంభం కావడంతో ఈ కారుపై ప్రజల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ ఆఫ్ రోడ్ SUV బుకింగ్స్ అక్టోబర్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది. కేవలం 60 నిమిషాల్లోనే దీనికి సంబంధించి 1.76 లక్షల యూనిట్లు బుకింగ్ అయ్యాయి. ఈ బంపర్ బుకింగ్ కారణంగా ప్రజలు తమ చేతుల్లోకి కారు రావాలంటే కొంత ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది.
మహీంద్రా థార్ రోక్స్ కోసం మీరు ఎంతకాలం వేచి చూడాలి?
మహీంద్రా థార్ రోక్స్ ఈ సంవత్సరం విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటి. ప్రజలు ఇప్పటికే 3 డోర్ థార్ విషయంలో మంచి క్రేజీగా ఉన్నారు. కానీ ఈ ఐదు డోర్ల మోడల్ రాకతో ఈ కారులో ప్రజలకు మరొక ఆప్షన్ లభించింది. మహీంద్రా ఆన్‌లైన్‌తో పాటు డీలర్‌షిప్‌లలో థార్ రోక్స్ బుకింగ్ ప్రారంభించింది.
మొదటి గంటలో మహీంద్రా థార్ రోక్స్ 1,76,218 కార్ల బుకింగ్స్‌ను పొందింది. ఆఫ్‌లైన్ బుకింగ్‌లతో ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. దసరా సందర్భంగా అక్టోబర్ 12వ తేదీ నుంచి కంపెనీ ఈ కారు డెలివరీని ప్రారంభించనుంది. డెలివరీ టైమ్‌టేబుల్ కూడా వచ్చే మూడు వారాల్లో కంపెనీ విడుదల చేస్తుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
మహీంద్రా థార్ రోక్స్ ఇంజిన్
థార్ రోక్స్ ఒక ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ. ఈ వాహనం పెట్రోల్ వేరియంట్ 2 వీల్ డ్రైవ్‌తో మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 162 హెచ్‌పీ పవర్, 330 ఎన్ఎం టార్క్ లభిస్తుంది. అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 177 హెచ్‌పీ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.
మహీంద్రా థార్ రోక్స్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో 152 హెచ్‌పీ పవర్‌ని, 330 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. డీజిల్ ఇంజన్ వేరియంట్‌లలో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది.
థార్ రోక్స్ ధర
మహీంద్రా థార్ రోక్స్ ఏడు కలర్ వేరియంట్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారులో 26.03 సెంటీమీటర్ల ట్విన్ డిజిటల్ స్క్రీన్ ఉంది. కారులో పనోరమిక్ స్కైరూఫ్ కూడా ఉంది. ఈ మహీంద్రా ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.99 లక్షల నుంచి మొదలై రూ. 22.49 లక్షల వరకు ఉంటుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే