APTET-2024 Initial Key: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET JULY-2024)లకు సంబంధించి అక్టోబర్ 3, 4వ తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రాథమిక 'కీ' పాఠశాల విద్యాశాఖ అక్టోబరు 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందబాటులో ఉంచింది. మిగతా పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ ‘కీ’లను పరీక్ష జరిగిన తర్వాతిరోజు విడుదల చేస్తారు. ఆన్సర్ కీలతోపాటు పరీక్షల ప్రశ్నపత్రాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ నెంబర్లు: 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 9505619127, 9963069286, 9398822618లలో లేదా ఈమెయిల్: grievances.tet@apschooledu.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల అర్హత పరీక్ష 'ఏపీటెట్ జులై-2024' (APTET JULY-2024) నోటిఫికేషన్ జులై 1న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఏపీటెట్ ఫీజు చెల్లింపు ప్రక్రియ జులై 3న ప్రారంభంకాగా.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 4న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఏపీటెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 3న ప్రారంభమైన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) అక్టోబరు 21 వరకు కొనసాగనున్నాయి. విడుదల చేసిన ఆన్సర్ కీలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే త్వరలోనే అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 27న తుది ‘కీ’ విడుదల చేసి; నవంబర్ 2న ఫలితాలను ప్రకటించనున్నారు.
ఏపీటెట్ జులై - 2024 ప్రాథమిక ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం:
➥ ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.
➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
కేటగిరీలవారీగా అర్హత మార్కులు..
ఏపీ టెట్ పరీక్షలో అర్హత మార్కులను ఓసీ(జనరల్) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.
APTET July 2024 - నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..