Andhra Pradesh News | కర్నూలు టీడీపీ నేత హత్యపై హోంమంత్రి స్పందన, వాళ్లని వదిలేది లేదని హెచ్చరిక
కర్నూలు జిల్లాలో జరిగిన టీడీపీ నేత హత్య ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. హత్య ఘటనలో నిందితుల కోసం వెతుకుతున్నామని.. ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని హోంమంత్రి తెలిపారు. తాను ఇప్పటికే కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడానని, నిందితుల్ని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం విశాఖలోని బెల్లం వినాయకుడిని, సంపత్ వినాయకుడిని కుటుంబ సమేతంగా వంగలపూడి అనిత దర్శించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో అలజడి-విజిలెన్స్ నోటీసులపై పోరాటానికి సిద్ధమైన ఉద్యోగులు
టీటీడీలో ఇంజినీరింగ్ విభాగంలో కలకలం రేగుతోంది. గతంలో జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పాలని నోటీసులు పంపించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ఉన్నతాధికారులు చెప్పినట్టు చేసిన తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవాణి ట్రస్ట్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ గందరగోళం! తిరగబడ్డ వాహనదారులు
హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద కొన్ని చోట్ల ఉన్న ఉచిత వాహనాల పార్కింగ్ ను ఉన్నట్టుండి పెయిడ్ చేయడం వివాదానికి దారి తీసింది. గురువారం (ఆగస్టు 14) నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో నిర్వాహకులు పెయిడ్ పార్కింగ్ అని చెప్పడంతో అది పెద్ద వివాదానికి దారి తీసింది. చాలా సేపు వాహనదారులకు నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. చాలా ఏళ్లుగా మెట్రో ప్రయాణికులు తమ వాహనాలను ఆ స్థలంలో ఫ్రీగా పార్కింగ్ చేసుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హైదరాబాద్‌కు సీఎం రేవంత్ - 10 రోజుల పర్యటనలో జరిగిన ఎంవోయూలు ఇవే
అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసిందని శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన సాగగా.. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మంత్రులందరికీ ఐప్యాడ్లు, ఇ-కేబినెట్ భేటీలపై సీఎం చంద్రబాబు నిర్ణయం
కాగిత రహిత సమావేశాలకు ఏపీ కేబినెట్ సన్నద్ధమవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై సీఎం చంద్రబాబు ఎంత ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో, మంత్రులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గతంలో చంద్రబాబు కాగిత రహిత ఇ-కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడా విధానాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై జరిగే కేబినెట్ సమావేశాలన్నీ కాగిత రహిత విధానంలో జరుగుతాయని మంత్రులకు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి