Chandrababu: మంత్రులందరికీ ఐప్యాడ్లు, ఇ-కేబినెట్ భేటీలపై సీఎం చంద్రబాబు నిర్ణయం

Chandrababu News: హైటెక్ సీఎంగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు ఇకపై ఇ-క్యాబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగిత రహిత క్యాబినెట్ సమావేశాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.

Continues below advertisement

e Cabinet Meetings in AP: కాగిత రహిత సమావేశాలకు ఏపీ కేబినెట్ సన్నద్ధమవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై సీఎం చంద్రబాబు ఎంత ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో, మంత్రులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గతంలో చంద్రబాబు కాగిత రహిత ఇ-కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడా విధానాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై జరిగే కేబినెట్ సమావేశాలన్నీ కాగిత రహిత విధానంలో జరుగుతాయని మంత్రులకు తెలిపారు. 

Continues below advertisement

చంద్రబాబు తొలుత 2014లో ఇ-కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కనబెట్టింది. కాగా, కేబినెట్ సమావేశం అంటే చాలు... ఆయా అంశాల ఆధారంగా అధికారులు కనీసం 40 సెట్ల పత్రాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కాగిత రహిత ఇ-కేబినెట్ సమావేశాల్లో ఆ పరిస్థితి కనిపించదు. ఎంచక్కా, మంత్రుల ఐ ప్యాడ్లకే సమావేశం అజెండా వివరాలన్నీ అప్ లోడ్ చేస్తారు. 

ఈ విధమైన హైటెక్ కేబినెట్ సమావేశాలతో పెద్ద మొత్తంలో ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా, కేబినెట్ నోట్స్ బయటికి లీక్ కాకుండా ఇ-కేబినెట్ విధానం ఉపకరించనుంది.

Continues below advertisement