కారంతో నోరు మాత్రమే కాదు.. శరీరం కూడా మంటపుడుతుంది. అందుకే ఎక్కడైనా కారం మిల్లు ఉందంటే చాలు.. అటు వైపుకు వెళ్లాలంటేనే హడలిపోయేవారు. అలాంటిది.. కారం నీళ్లతో స్నానం చేయడమంటే మాటలు కాదు. ఒళ్లంతా కాలిపోతున్నంత మంట పుడుతుంది. తమిళనాడుకు చెందిన ఓ పూజారి ఈ సాహసాన్ని చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 


తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లీ గ్రామానికి చెందిన పూజారి గోవిందం..108 కేజీల కారం నీళ్లతో స్నానం చేయడం చర్చనీయమైంది. ఏటా ఆది అమావాస్య రోజున స్థానిక గ్రామ దైవం పెరియ కరుప్పసామికి కారం, పాలతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు.. పూజారికి సైతం కారం నీళ్లతో స్నానం చేయిస్తారు. అలా చేయడం వల్ల దుష్టశక్తులు తొలగిపోయి అందరికీ మేలు జరుగుతుందని నమ్ముతారు. 


ముందుగా పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను విన్నాడు. ఆ తర్వాత ‘కారం అభిషేకం’లో పాల్గొన్నాడు. ఆ కారం ఘాటుకు భక్తులు సైతం అక్కడ నిలుచోడానికి ఇబ్బంది పడతారు. కానీ, పూజారి మాంత్రం ఏ మాత్రం కదలకుండా స్నానాన్ని ఆచరిస్తాడు.108 కేజీల కారం నీళ్లను అతడి నెత్తిమీద నుంచి కుమ్మరిస్తారు. ఆ నీళ్లు కళ్లలోకి వెళ్తున్నా సరే.. పూజారి ఆ మంటను భరిస్తూ విజయవంతంగా సాంప్రదాయాన్ని పూర్తిచేశాడు. కారం నీళ్లను చల్లిన తర్వాత భక్తులు మళ్లీ ఆయనపై నీళ్లు పోస్తారు. కారం ఘాటు పోయేవరకు అతడికి స్నానం చేయిస్తారు. ఈ సాంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి వస్తుందట. చిత్రం ఏమిటంటే ఆ సమయంలో పూజారి ఎలాంటి మంట పుట్టదట. ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏమిటంటే.. పెరియ కురుప్పస్వామికి భక్తులు మద్యం, సిగరెట్లను సైతం కానుకగా సమర్పిస్తారు.  


Also Read: ఏటీఎం మెషిన్‌లో ఇరుక్కుపోయిన దొంగ.. చోరీ ప్లాన్ విఫలమై పాట్లు!


తమిళనాడులోని మరికొన్ని ఆలయాల్లో కూడా ఇలాంటి వింత ఆచారాలను పాటిస్తుంటారు. వడక్కంపట్టి గ్రామంలోని మునీశ్వరుడి ఆలయంలో ‘మటన్ బిర్యానీ’ని దేవుడికి ప్రసాదంగా పెడతారు. అలాగే మదురై జిల్లా మేలూరులో ఎట్టిమంగళంలోని సక్కివీరన్ ఆలయంలో దేవుడికి మద్యం, మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని దైవాన్ని వేడుకుంటారు. ఈ సందర్భంగా ఆ ఆలయం ముందు భక్తులు వందల సంఖ్యలో కోళ్లను బలిస్తారు.  


Also Read: అది దెయ్యమేనా? కెమేరాకు చిక్కిన వింత ఆకారం.. నాగపూర్ ప్రజల్లో గుబులు!


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!