Man Attends Lover's Wedding Snatches Thaali: 


తమిళనాడులో ఘటన..


ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రియుడు...పూజారి నుంచి మంగళసూత్రం లాగేసుకున్నాడు. బలవంతంగా తన ప్రేయసికి తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. తమిళనాడులోని తొందియర్‌పేట్‌లో నేతాజీ నగర్‌లో జరిగిందీ ఘటన. తన లవర్‌ పెళ్లి జరుగుతోందని తెలిసి ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లిన యువకుడు ఆమెకు బలవంతంగా తాళి కట్టాలని చూశాడు. ఇంతలో వధువు కుటుంబ సభ్యులు వచ్చి వెనక్కి లాగేశారు. శుక్రవారం ఈ పెళ్లి జరగాల్సి ఉండగా...ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివాహం జరుగుతుండగా...పూజారి మంగళసూత్రాన్ని వరుడికి అందించబోయారు. హఠాత్తుగా ఓ యువకుడు వచ్చి ఆ తాళిని లాగేసుకున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ షాక్‌లో ఉండగానే...అమ్మాయి మెడలో కట్టాలని చూశాడు. పెళ్లికూతురు తరపున వాళ్లు ఒక్కసారిగా వచ్చి ఆ యువకుడిపై పడ్డారు. వెనక్కి లాగేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...ఆ యువకుడికి ఆ వధువే మెసేజ్ పంపిందట. "వచ్చి నన్ను తీసుకెళ్లు" అని మెసేజ్ చేశాకే...ఆ యువకుడు అక్కడికి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో వివాహం ఆగిపోయింది. వరుడు, వధువు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు కుటుంబాలు చర్చించుకుంటున్నాయట. 


ఇలాంటి ఘటనలెన్నో..


ఈ మధ్య కాలంలో ఇలాంటి వింత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపురంకు చెందిన బొద్దుల రాజేష్ అనే యువకుడి పెళ్లి గద్దేరాగడిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహ తంతు జరుగుతుండగానే... అక్కడకు ఓ అమ్మాయి వచ్చింది. అచ్చం తెలుగు సినిమాల్లో లాగానే పెళ్లి ఆపండి అంటూ గట్టిగా కేక వేసింది. ఏమైందంటూ అందరూ ఆమెను చూస్తున్నారు. ఆమె వధూవరు లిద్దరూ స్నేహితురాలేమో, ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె వచ్చింది వారిద్దరికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి కాదు. షాక్ ఇవ్వడానికి. వచ్చింది బంధువు కాదండోయ్ వరుడి ప్రేయసి. అదేంటీ అనుకుంటున్నారా. నిజమండి. ఆమె పెళ్లి కూతురుకో, పెళ్లి కుమారుడికో స్నేహితురాలు అయితే అదే జరిగేది. కానీ వచ్చింది నవ వరుడి ప్రేయసి. పెళ్లి పీఠల మీద కూర్చొని మరో అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు రెడీగా ఉన్న రాజేష్ తనను ప్రేమించాడని, గత ఎనిమిదేళ్లుగా తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుం టున్నట్లు బంధువుల అందరి ముందే చెప్పింది. అందుకే ఆ పెళ్లిని ఆపేసింది. తనను మోసం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు విన్న అమ్మాయి తరపు బంధువులంతా ముక్కున వేలేస్కున్నారు. చోద్యం చూసినట్లుగా చూస్తుండిపోయారు. 


పెళ్లి కుమారుడు బొద్దుల రాజేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ప్రియురాలు రమినా కూడా గతంలొ రామకృష్ణపురంలోనే ఉండే వారని... అయితే కొన్నేళ్ళుగా ఆమె హుజూరాబాద్ లో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో రమినాకు ఓ యువకుడితో పెళ్లి జరిగింది. ఆ తరువాత వారు విడిపోవడంతో రాజేష్ పరిచయం అయ్యాడు. గత ఎనిమిదేళ్లుగా రాజేష్ తనను ప్రేమిస్తున్నాడని, తనను శారీరకంగాను వాడుకున్నాడని, గతేడాది అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది. తనతో రాత్రి వరకు వాట్సాప్ లో చాట్ చేశాడని.. అసలు ఈ పెళ్ళి విషయం తనకేమి తెలియదని చెప్పింది. అయితే రాజేష్ వాళ్ల బంధువులో ఒకరు వాట్సప్ స్టేటస్ పెడితే ఈ పెళ్ళి విషయం తనకు తెలిసిందిని వివరించింది. 


Also Read: Butter: నెయ్యి నుంచి వెన్న కావాలా? అయితే ఇలా చేస్తే సరి