దేశంలో కరోనా కేసులు పెరుగుతోన్న వేళ తమళినాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. దీంతో పాటు ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నామన్నారు. దీంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధించారు. తమిళనాడులో మంగళవారం 2,731 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంక్షలు ఇవే..
> గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు వర్తింపు. ఎలాంటి దుకాణాలు, వ్యాపార సముదాయాలు ఈ సమయంలో తెరవకూడదు.
> పెట్రోల్, డీజిల్ బంకులకు 24 గంటలు తెరుచుకునే అవకాశం.
> ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచన.
> ఆదివారాలు సంపూర్ణ లాక్‌డౌన్. ఈ సమయంలో కేవలం ఏటీఎంలు, పాల డిపోలు, మెడికల్ షాపులు, పెంట్రోల్ బంకులు మాత్రమే నడపాలి.
> సండే లాక్‌డౌన్ సమయంలో ప్రజా రవాణా, మెట్రో రైళ్లు నడపకూడదు.
> ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే రెస్టారెంట్లకు అనుమతి. ఈ సమయంలోనే డెలివరీ బాయ్స్ కూడా పనిచేయాలి.
> రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లకు వెళ్లే వారికి టికెట్ దగ్గరుంటేనే అనుమతి.
> 1-9వ క్లాసు విద్యార్థులకు ఎలాంటి భౌతిక తరగతులు లేవు.
> 10-12వ తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహించాలి.
> పరీక్షలు ఉన్న కళాశాలలు మినహా మిగిలినవన్నీ జనవరి 20 వరకు మూసేయాలి.
దేశంలో కొత్తగా 58,097 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా 2100 మార్కు దాటింది. ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కు చేరింది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,14,004కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.61%గా ఉంది. దేశంలో రికవరీ రేటు 98.01%గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం 4.18%గా ఉంది.
Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!
Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం