Raigad Suspicious Boat:


పడవలో AK-47 గన్స్, బులెట్స్ 


మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోస్ట్‌లో ఓ అనుమానాస్పద బోట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు AK-47 రైఫిల్స్‌తో పాటు బులెట్స్ కూడా దొరికాయి. స్థానికులు కొందరు పడవను గుర్తించారు. శ్రీవర్ధన్ ప్రాంతంలో కనిపించిన ఈ పడవలో ఎవరూ లేకపోవటం చూసి భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. రాయ్‌గఢ్ ఎస్పీ అశోక్ దూదేతో పాటు మరి కొందరు సీనియర్ అధికారులు వెంటనే స్పాట్‌కు వెళ్లారు. పడవను తనిఖీ చేయగా...అందులో గన్స్, బులెట్స్ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..విచారణ చేపడుతున్నారు. "హరిహరేశ్వర్ బీచ్ వద్ద గుర్తు తెలియని పడవ ఒకటి కనిపించింది. రాయగఢ్ జిల్లాలోని భద్రకోల్ ప్రాంతంలో ఓ లైఫ్‌ బోట్ గుర్తించాం. ఈ రెండు పడవల్లోనూ ఎవరూ లేరు. కోస్ట్‌ గార్డ్‌తో పాటు మహారాష్ట్ర మెరిటైమ్ బోర్డ్‌కు ఈ విషయం తెలియజేశాం. పోలీసులు విచారిస్తున్నారు" అని రాయ్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. ఒమన్‌ కోస్ట్‌లో ఈ పడవ జూన్‌లో ప్రమాదానికి గురైందని, ఇందులోని సిబ్బందిని అప్పుడు కాపాడామని అధికారులు చెబుతున్నారు. ఆ పడవే నీళ్లలో కొట్టుకు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. మహారాష్ట్ర ATS సిబ్బంది రాయ్‌గఢ్‌కు చేరుకుంది. హరిహరేశ్వర్ బీచ్ వద్ద భద్రత పెంచారు.









 వివరణ ఇచ్చిన హోం శాఖ..


అయితే...కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం...ఈ బోట్ పేరు "Ladyhan"అని నిర్ధరించింది. ఈ బోట్ ఓనర్...ఆస్ట్రేలియాకు చెందిన మహిళ హనా లోర్డోర్గన్ అని వెల్లడించింది. ఆమె భర్త జేమ్స్ హార్బర్ట్ ఈ పడవకు కేప్టెన్‌గా వ్యవహరించారని చెప్పింది. ఈ ఏడాది జూన్ 26న మస్కట్ నుంచి యూరప్‌కు బయల్దేరారని, అయితే మార్గ మధ్యలో ఇంజిన్ ఫెల్ అయిందని తెలిపింది. సాయం కోసం ఎదురు చూస్తుండాగ...ఓ కొరియన్ యుద్ధ నౌక సిబ్బంది వీరికి సహకరించింది. ఆ భార్యాభర్తల్ని ఒమన్‌లో దింపేశారు. వాతావరణం సహకరించకపోవటం వల్ల బోట్‌ని వెనక్కి తీసుకుని వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ పడవే నీళ్లలో కొట్టుకు వచ్చినట్టు భావిస్తున్నారు. 


Also Read: Bandi Sanjay : భౌతిక దాడులు ఖాయం - బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక !


Also Read: Deadly Kiss: ముద్దు పెట్టిందని మహిళపై మర్డర్ కేసు, అసలు కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వుద్ది!