ఇండియాలో బహిరంగంగా ముద్దు పెట్టడం తప్పు. కానీ.. విదేశాల్లో సర్వసాధారణం. ఎవరు ఎక్కడైనా ముద్దు పెట్టుకుంటారు. పబ్లిగ్గా ముద్దు పెట్టుకునే సీన్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. అయితే ఓ మహిళ తన ప్రియుడిని ముద్దు పెట్టుకుందని ఏకంగా మర్డర్ కేసు పెట్టారు పోలీసులు. ముద్దు పెట్టుకుంటే హత్య కేసు నమోదు చేస్తారా? అనేగా మీ సందేహం. నిజం తెలిస్తే తప్పకుండా మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది.   


అమెరికాకు చెందిన రేచల డాలర్డ్ అనే మహిళ.. జైల్లో ఉన్న తన ప్రియుడు జాషువా బ్రౌన్ ను కలిసింది. ఈ సందర్భంగా ఆమె తన ప్రియుడిని గాఢంగా ముద్దు పెట్టుకుంది. అదే తన కొంప ముంచింది. ఆ ముద్దు కారణంగానే ఇప్పుడు తనపై మర్డర్ కేసు నమోదైంది. కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఇంతకీ ఆ ముద్దు వెనుకున్న అసలు కారణం ఏంటంటే..


రేచల్  ప్రియుడు జాషువాకు మాదక ద్రవ్యాల కేసులో 11 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో అతడిని కలిసేందుకు రేచల్ తరచుగా జైలుకు వెళ్లి వస్తుంది. రోజు రేచల్ తన ప్రియడికి డ్రగ్స్ అందివ్వాలి అనుకుంది. కానీ, జైల్లోకి డ్రగ్స్ తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. అందుకే ఆమె ఓ ఐడియా వచ్చింది. డ్రగ్స్‌ను చిన్న బెలూన్‌లో నింపి నోటిలో పెట్టుకుంది. దాన్ని మింగేయకుండా చాలా జాగ్రత్తగా నోటిలోనే ఉంచుకుంది. జైలు అధికారులు కూడా ఆమె నోటిలో డ్రగ్స్‌ను కనిపెట్టలేకపోయారు. 


మొత్తానికి ఆమె జైల్లోకి చేరుకుంది. కానీ, చుట్టూ ఉన్న కెమేరాల్లో ఆమె ఏం చేసినా తెలిసిపోతుంది. దీంతో ప్రియుడు జాషువాకు అదరాలను అందుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నట్లు నటించింది. తన నోటిలోని డ్రగ్స్ బెలూన్‌ను అతడి నోటిలోకి పంపింది. దాన్ని అతడు నోటిలోని ఉంచుకుని, వాష్ రూమ్‌కు వెళ్లిన తర్వాత దాన్ని తీసి దాచుకోవాలి. కానీ, అతడు దాన్ని పొరపాటున మింగేశాడు. దీంతో ఆ బెలూన్ పేలిపోయి.. అందులోని మెథాంఫేటమిన్‌ అంతా శరీరంలో కలిసిపోయింది. మోతాదు కంటే ఎక్కువ డ్రగ్స్ కడుపులోకి చేరడంతో వల్ల అతడు అక్కడికక్కడే చనిపోయాడు.    


జైల్లోకి డ్రగ్స్ ఎలా వెళ్లాయో చెప్పాలి?


సీసీటీవీ ఫూటేజ్ పరిశీలించి పోలీసులు.. ఈ డ్రగ్స్ ను రేచలే.. తన నోటి ద్వారా జాషువా కడుపులోకి పంపినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే రేచల్ జాషువాకు డ్రగ్స్ ఇచ్చిందని పోలీసులు ఎలా నిర్దారించాలో చెప్పాలని డిఫెన్స్ లాయర్ వాదిస్తున్నాడు. జైల్లో ఖైదీలను పరామర్శించేందుకు వచ్చే వారిని అధికారులు ముందుగానే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి నిషేధిత వస్తువులు లేకుండా చూస్తారు. టెక్నాలజీ సాయంతో ఫుల్ బాడీ స్కాన్ చేస్తారు. డ్రగ్-డిటెక్షన్ కూడా ఉంటుంది. ఆ చెకింగ్ ను తప్పించుకుని రేచల్ డ్రగ్స్ ఎలా తీసుకెళ్లగలిగిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు.


పోలీసుల తీరును ఖండించిన రేచల్ తల్లి


ఈ కేసును రేచల్ తల్లి సోనియా తీవ్రంగా ఖండించింది. తన కుమార్తె అలా చేయదని వెల్లడించింది.  ఆమెపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించింది. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఈ కేసులో రేచల్ దోషిగా తేలితే.. కోర్టు సుమారు 60 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ కేసు నిలబడే అవకాశాలు తక్కువేనని అక్కడి న్యాయవాదులు భావిస్తున్నారు. 


Also read: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి


Also read: ఈ బిర్యానీ చాలా స్పెషల్, రైస్ అవసరం లేదు, జీవితంలో ఒక్కసారైన రుచి చూడాల్సిందే