Sri Krishna Janmashtami 2022:  శ్రీ కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశం  మీకు మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మరి మీరు కూడా మీ సన్నిహితులు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి.. 


1. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!


2.రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!


౩.“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి || ”
“ నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు. ” 
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!


Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!


4.కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
మిత్రుందరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!


5. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!


6. "నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ 
నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము 
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా"
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభకాంక్షలు!


Also Read: కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!


7. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మెలతాడు పట్టు దట్టి 
సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతుము...
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!


8. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ కృష్ణ భగవానుడు భువిపై అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి. అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.


9. శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, ఈ కృష్ణాష్టమి మీ జీవితాలలో ఆనందం చేకూర్చాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!


Also Read: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!


10. “మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు.. అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం గోచరిస్తుంది” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు


11. ”చావు పుట్టుకలు సహజం.. ఎవరూ దాన్ని తప్పించలేరు.. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు” అందరికీ  శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు


12. ”నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి.. నీకు నీవే ఇచ్చుకుంటే.. నీకు నీవే అధిపతివి.. మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు


13.”యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు


14. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది.. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు


15. అతసీ పుష్ప సంకాశం, హారనూపుర శోభితమ్
రత్న కంకణ కేయూరం, కృష్ణం వన్డే జగద్గురుమ్
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు