చాలా మందికి ఒక కప్పు పాలతో టీ చేసుకుని తాగితే కానీ తెలవారదు. రోజును ప్రారంభించాలంటే గుక్కెడు టీ గొంతులో పడాల్సిందే. పాలతో చేసిన టీ రుచికి నాలుక అలవాటు పడిపోయింది. అది సమయానికి పొట్టలో పడకుంటే ప్రాణం విలవిలలాడిపోతుంది. రోజుకో కప్పు టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యా లేదు కానీ కొంతమంది రోజులో నాలుగు నుంచి అయిదు కప్పుల టీని తాగేస్తుంటారు. ఇలా అధిక మొత్తంలో టీ తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు ఉన్నాయి. నేరగా చెప్పాలంటే అది చెడు అలవాటే.టీ అధికంగా తాగడం వల్ల వచ్చే అనార్థాలేంటో మీరే తెలుసుకోండి. 


డీ హైడ్రేషన్
పాలతో చేసిన టీ అతిగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. టీలో కూడా కెఫీన్ ఉంటుంది. రోజులో నాలుగైదు సార్లు టీ తాగడం వల్ల కెఫీన్  అధికంగా చేరుతుంది. అది శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టివ మితంగా తాగడం ఉత్తమం.  


మలబద్ధకం
టీ అధికంగా తాగే వారిలో మల విసర్జన కష్టంగా మారుతుంది. టీలో థియోఫిలన్ అనే కెఫీన్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని కలిగిస్తుంది. కాకపోతే ఇది శరీరం చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. రక్తప్రవాహాన్ని పెంచుతుంది. 


పొట్ట ఉబ్బరం
పాలతో చేసిన టీని అధికంగా తాగడం వల్ల పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. పట్టేసినట్టు అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనిలో ఉండే కెఫీనే కారణం. పాలు, కెఫీన్ కలయిక గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతుంది. అంతేకాదు మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఇది ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి కారణం అవుతుంది. కాబట్టి టీ తాగడం తగ్గిస్తే మంచిది. 


రక్తపోటు
అధిక రక్తపోటు ఉన్న టీని అధికంగా తాగకూడదు. లేని వారు కూడా తాగకపోవడమే మంచిది. టీ రోజులో అధికంగా తాగితే వారు అధికరక్తపోటు బారిన పడే అవకాశం పెరుగుతుంది. టీ మితంగా తాగితే ఎంతో ఆరోగ్యం. గుండె ఆరోగ్యానికి సహకరించండి, మెదడు పనితీరు మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటివి చేస్తుంది. అదే అధికంగా తాగితే మాత్రం నష్టాలు తప్పవు.  


మొటిమల సమస్య
చర్మంపై మొటిమలు వస్తుంటే టీ తాగడం ఆపేయండి. పాలతో చేసిన టీ మొటిమలు రావడం పెరుగుతుంది. రోజుకో కప్పు తాగడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు కానీ అంతకన్నా తాగితే మాత్రం మొటిమలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు మొటిమలకు దూరంగా ఉండాలంటే టీకి దూరంగా ఉండండి. కనీసం మొటిమలు వస్తున్న సమయంలోనైనా అవి తగ్గే వరకు తేనీటిని తాగడం ఆపేస్తే మంచిది. 


Also read: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి


Also read: ఈ బిర్యానీ చాలా స్పెషల్, రైస్ అవసరం లేదు, జీవితంలో ఒక్కసారైన రుచి చూడాల్సిందే

































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.