CM KCR Karimnagar Tour: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 21వ తారీఖున కరీంనగర్ జిల్లాకు రానున్నారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల కుటుంబాల్లో వివాహ వేడుకలు ఉండడంతో ఆయన హాజరుకానున్నారని సమాచారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కుమారుడి వివాహం, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కూతురి వివాహానికి ఆహ్వానాలు అందడంతో ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తీగల గుట్టపల్లిలో గల ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేయనున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా సీఎం కరీంనగర్ ఇంటి వద్ద అనూహ్యంగా భద్రత పెంచడంపై సర్వత్ర ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
సాధారణంగా గతంలో ఉత్తర తెలంగాణ భవన్ వద్ద వన్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ ఉండేది. ఒక్కసారిగా రిజర్వ్ బలగాలను పెంచడంతోపాటు ప్రత్యేకంగా నిఘా వర్గాలను కూడా రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. సుమారు పది మంది సభ్యుల పోలీసు బృందం సీఎం ఇంటి వద్ద కాపలా కాస్తున్నారు మామూలుగా కేసీఆర్ వచ్చే సందర్భాల్లో ఒక రోజు ముందు మాత్రమే పరిశీలించి దానికి తగ్గట్టుగా బలగాలను నియమించేవారు. కానీ ఈ సారి పగలు రాత్రి కూడా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు భద్రతా ఏర్పాట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా సిబ్బందిని కూడా పెంచడంపై పలువురు చర్చించుకుంటున్నారు.
సాధారణ సమయాల్లో ఉత్తర తెలంగాణ భవన్ వద్ద వన్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ ఉండేది వీటితో పాటు బ్లూ కోర్స్ లాండ్ ఆర్డర్ పోలీసు పెట్రోలింగ్ నిర్వహించేవారు. కానీ ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్లు ఉన్నత స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఉత్తర తెలంగాణ భవన్ వద్ద రిజర్వు బలగాలను పెంచడంతోపాటు నిఘా వర్గాలను కూడా ప్రత్యేకంగా నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కరీంనగర్ పది మందిని అదనంగా నిర్మించినట్లు సమాచారం అంతేకాకుండా డ్యూటీ కూడా ప్రత్యేకంగా తయారుచేసి పంపించినట్లు తెలుస్తోంది.
ఇక అనుమానాస్పదంగా కనిపించిన ఇలాంటి వ్యక్తులైనా ఫోటోలు వీడియోలు తీయాలంటూ భద్రతా విధుల్లో ఉన్న సిబ్బందికి స్పష్టం చేసినట్టుగా సమాచారం దీనివల్ల ఎవరైనా సీఎం కదలికలపై దృష్టి పెడుతున్నారు అని పరీక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా బిజెపి తన నిరసన ధర్నా కార్యక్రమాలు పెంచడంతో సీఎం పర్యటనలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు స్థానిక నాయకులు అడ్డుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా దూకుడుగా వెళ్తున్న బిజెపి ఈ మధ్య వచ్చిన వరదలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం - వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు వరద సహాయం అందించాలని పలుమార్లు డిమాండ్ చేసింది. పైగా కాలేశ్వరానికి సంబంధించి జరిగిన డ్యామేజీ వల్ల కోట్ల రూపాయల నష్టం జరిగిందంటూ ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో సీఎం టూర్ ఉండడంతో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను ఎన్నడూ లేని విధంగా కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది.