- చక్కెర కర్మాగారాల మూత అన్యాయం..  బొజ్జల సుధీర్ రెడ్డి
- చక్కెర ఫ్యాక్టరీని పునరుద్దరిస్తాంమని సీఎం మాట తప్పారు..
- 4 ఏళ్లు గడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీల విషయం ఎందుకు నిర్ణయం‌ తీసుకోలేదు..


Bojjala Sudhir Reddy: చక్కెర కర్మాగారాలు పునరుద్దరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పారని టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శించారు. సోమవారం రేణిగుంటలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో తిరుపతి జిల్లా రైతులతో శ్రీకాళహస్తి నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ సమావేశం అయ్యారు. రైతుల సమస్యలను సుధీర్ రెడ్డి నేరుగా అడిగి తెలుసుకుకున్నారు. రైతులకు ఎప్పుడూ టీడీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 
అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఆర్డర్ పై సుధీర్ రెడ్డి స్పందిస్తూ.. చక్కెర కర్మాగారంపై సుమారుగా 6000 పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కార్మికులను అన్యాయంగా రోడ్డుపై పడి వేయడం చాలా దారుణంమని ఆయన అన్నారు. కర్మాగారం మూత పడటంతో రైతులే కాక ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారన్నారని ఆయన గుర్తు చేశారు. కోట్లాది రూపాయలు ఫ్యాక్టరీ సొసైటీలో షేర్‌ దారుల శ్రమతో నిర్మించిన ఫ్యాక్టరీ నేడు శిథిలావస్థకు చేరుకోవడం బాధకరం అన్నారు. వెంటనే చక్కెర కర్మాగారాన్ని పరిశీలించి క్రషింగ్‌ ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని, కర్మాగారం తక్షణమే ప్రారంభించాలని, సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టే కంటే ఈ షుగర్ ఫ్యాక్టరీని పున నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ గాలికొదిలేశారని, టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం లాంటి పలు హామీలకు అమలు చేయలేదని విమర్శించారు.
Also Read: Nara Lokesh: నాకు కూతురు పుట్టాలని దేవుడ్ని కోరుకున్నాను- మహిళలతో ముఖాముఖీలో నారా లోకేశ్


టీడీపీ అధికారం లోకి వస్తే పునఃప్రారంభం..
తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో విజయం సాధిస్తే తప్పకుండా ఆరు నెలల లోపు ఈ సహకార చక్కెర ఫ్యాక్టర్ ని పునఃప్రారంభిస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం సహకార చక్కెర కర్మాగారాలను పునరుద్ధరణ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కార్మికులకు ఇవ్వవలసిన జీతాల బకాయిలను చెల్లించలేదని, గాజుల మండ్యం చెక్కర ఫ్యాక్టరీ లిక్విడేషన్ అంటే శాశ్వతంగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సరైన విధానం కాదన్నారు. సంబంధిత జీవోని వెంటనే వెనక్కి తీసుకొని లిక్విడేషన్ ఆపాలని ఆయన కోరారు. ప్రతిపక్ష టీడీపీ ఆధ్వర్యంలో చెరుకు రైతులందరితో నియోజకవర్గంలోని రైతులతో ధర్నా నిర్వహిస్తాంమని ఆయన హెచ్చరించారు. చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించి రైతులు, కార్మికులకు భరోసా కలిగేలా‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: Vande Bharat Express: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఏపీలో మరో వందేభారత్ 7 నుంచి మధ్య పరుగులుJoin Us on Telegram: https://t.me/abpdesamofficial