ABP  WhatsApp

SKM Update: రైతులతో బుధవారం కేంద్రం కీలక భేటీ.. కథ క్లైమాక్స్ చేరిందా?

ABP Desam Updated at: 07 Dec 2021 07:58 PM (IST)
Edited By: Murali Krishna

సాగు చట్టాలపై రైతుల చేస్తోన్న ఉద్యమం క్లైమాక్స్‌కు వచ్చిందా? రేపు జరగబోయే సమావేశంలో ఇది తేలే అవకాశం ఉంది.

రైతులతో కేంద్రం కీలక భేటీ

NEXT PREV

దాదాపు ఏడాది కాలంగా సాగు చట్టాల రద్దుపై రైతులు చేస్తోన్న పోరాటానికి రేపు ముగింపు దొరకనుందా? ఈ విషయంపై బుధవారం మధ్యాహ్నం కేంద్రంతో సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్‌కేఎమ్)కు చెందిన ఐదుగురు సభ్యుల కమిటీ సమావేశం కానుంది. రైతుల ముందు కేంద్రం ఐదు ప్రతిపాదనలు పెట్టనుందని సమాచారం. 


ప్రతిపాదన..


కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)పై కేంద్రం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎమ్‌ఎస్‌పీపై చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వడంపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రకటించింది. ఈ కమిటీలో రైతుల సంఘాలు, ప్రభుత్వ అధికారులు సహా రాష్ట్ర ప్రతినిధులు ఉండనున్నారు.


రైతులపై పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.


ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై పంజాబ్‌కు చెందిన 90 శాతం మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.


రేపే తేలనుంది..



మేం ఆందోళన విరమిస్తేనే మాపై కేసులను ఉపసంహరిస్తామని ప్రభుత్వ ప్రతిపాదన చెబుతోంది. కానీ దీనిపై మాకు స్పష్టత లేదు. కేసులు వెనక్కి తీసుకునే ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలి. ఆందోళన విరమించడంపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటాం.                                             - సంయుక్త కిసాన్ మోర్చా



మా డిమాండ్లకు అంగీకరిస్తున్నాం.. ఆందోళన విరమించాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వ ప్రతిపాదనలు స్పష్టంగా లేవు. ఈ ప్రతిపాదనలపై మాకున్న ఆందోళనలు రేపు మధ్యాహ్నం జరగబోయే సమావేశంలో తొలిగే అవకాశం ఉంది. మా ఆందోళన ఎక్కడికి వెళ్లదు.. మేమూ ఎక్కడికి వెళ్లం.                                               - రాకేశ్ టికాయత్, బేకేయూ నేత 


Also Read: Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?


Also Read: Rahul Gandhi In Lok Sabha: 'ఆ రైతు కుటుంబాలకు పరిహారమే కాదు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి'


Also Read: UAE New Weekend Days: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!


Also Read: PM Modi on Parliament Attendance: ఎంపీలకు మోదీ వార్నింగ్.. 'మీరేం చిన్నపిల్లలు కాదు.. మారతారా లేక మార్చేయాలా'


Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!


Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు


Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి


Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే


Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి


Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 07 Dec 2021 07:57 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.