ABP  WhatsApp

Shraddha Murder Case: శ్రద్ధా సిగరెట్ తాగిన ప్రాంతానికి పోలీసుల ప్రత్యేక బృందం!

ABP Desam Updated at: 18 Nov 2022 03:44 PM (IST)
Edited By: Murali Krishna

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం పలు ప్రదేశాలకు ప్రత్యేక బృందాలను పంపించారు.

శ్రద్ధా సిగరెట్ తాగిన ప్రాంతానికి పోలీసుల ప్రత్యేక బృందం!

NEXT PREV

Shraddha Murder Case: దిల్లీ హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. శ్రద్ధాను హత్య చేసే ముందు ఆమెతో కలిసి ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా సందర్శించిన ప్రాంతాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


సిగరెట్ తాగిన


గత కొన్ని నెలలుగా శ్రద్ధా- అఫ్తాబ్ జంట సందర్శించిన ప్రదేశాలకు పోలీసు బృందాలు వెళ్తాయి. ఆయా ప్రాంతాల నుంచి వ్యక్తుల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని శివపురి సమీపంలోని గంగా నది ఒడ్డున ఉన్న వశిష్ట గుహ వద్దకు పోలీసు బృందాలలో ఒకదాన్ని పంపారు. హత్యకు కొద్ది రోజుల ముందు ఈ జంట గుహను సందర్శించారు. మే 4న శ్రద్ధా ఒక రీల్‌ను పోస్ట్ చేసింది. అందులో ఈ ప్రాంతం గురించి చెప్పింది.







1500 కిమీలు ప్రయాణించి చాలా అలసిపోయాం. దీంతో నేను నా రోజును సూర్యాస్తమయంతో ముగించాలని నిర్ణయించుకున్నాను. వశిష్ట గుహ నుంచి గంగా తీరానికి నడిచాం. గంగా నది ఒడ్డున కూర్చొని, స్మోక్ చేస్తూ.. దాని అందంలో మునిగి తేలుతున్నాను.                                              - శ్రద్ధా ఇన్‌స్టా రీల్


ఇన్‌స్టా ఆధారంగా


ఆమె పోస్ట్ చేసిన ఏకైక రీల్ ఇది. దీని తర్వాత మే11న శ్రద్ధా చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. అందులో ఆమె ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లు చూడవచ్చు. ఆమె ఆ ప్రదేశాన్ని 'గార్డెన్ కేఫ్' (హిమాచల్ ప్రదేశ్‌లో) అని ట్యాగ్ చేసింది. పోలీసులు ఈ రెస్టారెంట్‌ను కూడా సందర్శించనున్నారు. 


శ్రద్ధాను హత్య చేసిన తర్వాత అఫ్తాబ్ ముంబయి వెళ్లి, తర్వాత దెహ్రాదూన్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా మొబైల్ ఫోన్‌ను అఫ్తాబ్ మహారాష్ట్రలో పారేసాడు. శ్రద్ధ హత్య జరిగిన తర్వాతి రోజుల్లో అఫ్తాబ్ వెళ్లిన ప్రాంతాలను సందర్శించి ఆధారాలు సేకరించేందుకు పోలీసులు దిల్లీ, గురుగ్రామ్, ముంబయిలోని ప్రదేశాలను కూడా పరిశీలిస్తున్నారు.


Also Read: Bhima Koregaon Case: భీమా కోరెగావ్ కేసులో ప్రొఫెసర్ ఆనంద్‌కు బెయిల్- కానీ చిన్న ట్విస్ట్!

Published at: 18 Nov 2022 03:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.