Kavita On BJP Offer :  భారతీయ జనత పార్టీ లో చేరాలని కవితపైనా ఒత్తిడి తెచ్చారంటూ పార్టీ కార్యవర్గ సమావేశంలో  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని కవిత స్సప్టం చేశారు. ఎంపీ అర్వింద్ తాను కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించినట్లుగా చేసిన ఆరోపణలపై స్పందించేందుకు ఆమె తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేని.. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారన్నారు. " షిండే మోడల్ " అంటే.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే .. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తనతో పాట తీసుకు పోయి.. తనదే శివసేన అని ప్రకటించుకున్నట్లుగా రాజకీయం మార్చడం. కవితను అలా షిండే తరహాలో రాజకీయం చేయాలన్న ఆఫర్ ఇచ్చినట్లుగా కవిత చెబుతున్నారు. 


తెలంగాణ షిండేగా కవితను చూడాలనుకున్న బీజేపీ నేతుల !


తెలంగాణ రాజకీయాల్లోనూ షిండేలు ఉన్నారని గతంలో  బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రకటించారు. వారంతా సమయం చూసి  బయటకు వస్తారని ప్రకటించారు. ఈ షిండేల వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు.  ఇదేం పద్దతని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు భయపడి వెళ్తే ఓ పది మంది వెళ్తారని అంతే కానీ.. షిండేల్లా ఎవరూ ఉండరన్నారు. అయితే ఆ షిండేను నేరుగా కేసీఆర్ కుటుంబం నుంచే వచ్చేలా ప్రయత్నించిందని బీజేపీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ఎవరు సంప్రదించారు ? ఎలాంటి చర్చలు జరిగాయి ? అన్న వివరాలను కవిత ఇంకా  బయట పెట్టలేదు. సంప్రదించిన వారి పేరు బయట పెడితే ఇంకా సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. 


తెలంగాణ వాసన లేని పార్టీలో ఎలా చేరుతారనని ప్రశ్నించిన కవిత 


తెలంగాణలో షిండే మోడల్ నడవదని కవిత స్పష్టం చేశారు.  జై మోడీ అన్న వారి పైన ఈడీ దాడులు ఉండవన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ మోదీ అల్లుళ్లు అని లాలూ యాదవ్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఈడీ  దాడులకు భయపడబోమని .. ఖచ్చితంగా జాతీయ రాజకీయల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.  అరవింద్ కాంగ్రెస్ నేతలతో ఏం పని..బీజేపీ లో ఉంటూ కాంగ్రెస్ కు పని చేస్తున్నారా అని ప్రశ్నించాు. నిజామాబాద్ లో కాంగ్రెస్ తో కుమ్మకై నా మీద గెలిచారని... తెలంగాణ వాసన లేని పార్టీ ల్లో నేనెలా చేరుతానని ప్రశఅనించారు. తన రాజకీయ జీవితంలో తాను నమ్మే  నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. తన  రాజకీయ ప్రయాణం కేసీఆర్ తోనేనన్నారు.  


బీజేపీతో కేసీఆర్ చెప్పిన యుద్ధం ప్రారంభమైనట్లేనా ? 


టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కవితనే పార్టీ మారమని బీజేపీ నేతలు అడిగారని.. ఇంత కంటే ఘోరం ఉంటుందా అని కేసీఆర్ చెప్పిన అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది. వారు వస్తామన్నా తాము పార్టీలో చేర్చుకోబోమని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ మాటలకు కౌంటర్ ఇచ్చేందుకు ధర్మపురి అర్వింద్.. కవిత .. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని చెప్పడం దుమారానికి కారణం అయింది. ఈ అంశంపై రెండు పార్టీల మధ్య దాడులు కూడా ప్రారంభమయ్యాయి.