Mahakumbha Mela 2025: మహాకుంభమేళా(Maha Kumbha Mela) హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగనే చెప్పాలి. ఎన్నో ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ద్వారా.. పరమ పవిత్రం కావాలని హిందువులు(Hindus) కోరుకుంటారు. ఉత్తరప్రదేశ్(Uttara Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఈ మహా కుంభమేళా ప్రారంభంకానుంది. ఈ మహా ఉత్సవానికి సంబంధించి.. ఇప్పటికే ఏర్పాట్లు కూడా వడివడిగా సాగుతున్నాయి. స్నాన ఘాట్ల నిర్వహణతోపాటు.. వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు అసలు కుంభమేళా నిర్వహించే ప్రయాగ్‌రాజ్ ప్రాంతాన్ని `కుంభమేళా జిల్లా` కూడా.. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్(CM Yogi Adityanath) ప్రభుత్వం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. లక్షలు కాదు.. కోట్ల సంఖ్యలోనే హిందువులు ఈ కుంభమేళాలో పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే.. ఈ సారి కుంభమేళాకు వచ్చే భక్తులు.. సాదాసీదాగా కాకుండా.. మరిన్ని సొమ్ములు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. కుంభమేళాలో నదిలో ప్రయాణించేందుకు పడవల ప్రయాణ రుసుమును ప్రభుత్వం 50 శాతం వరకు పెంచింది.
50 శాతం అదనం!
డిమాండ్ ఎంత ఉంటే అంత తక్కువ ధరలకు సేవలైనా వస్తువులైనా ప్రజలకు చేరువ చేయాలని ఆర్థిక సూత్రాలు చెబుతాయి. కానీ, గత కొన్నేళ్లుగా దేశంలో దీనికి రివర్స్ నడుస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే.. విమాన చార్జీలు పెంచుకునే వెసులుబాటు కల్పించినట్టే.. ఇప్పుడు కుంభమేళా(Kumbhamela) సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చే ప్రయాణికుల నుంచి ఎక్కువ మొత్తం తీసుకునేలా పడవల నిర్వాహకులకు యూపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బోట్‌మెన్(Boatmen)ల ఆదాయాన్ని(Income) పెంచడానికి, ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ బోట్ల ఛార్జీలను 50 శాతం పెంచడానికి అంగీకరించింది. అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(Collector) (మహా కుంభ్) వివేక్ చతుర్వేది(Vivek chaturvedi) దీనిపై స్పందిస్తూ.. పవిత్ర సంగంలో తిరిగే బోట్ల ఛార్జీలను 50 శాతం పెంచినట్టు తెలిపారు. చాలా కాలంగా బోట్ యజమానులు తమ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారని, ప్రయాగ్‌రాజ్ జిల్లా సెయిలర్స్ అసోసియేషన్, ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ మధ్య జరిగిన చర్చల అనంతరం రుసుములు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Also Read: మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!
పడవల యజమానులు హర్షం..
ప్రయాగ్‌రాజ్ జిల్లా సెయిలర్స్ అసోసియేషన్(Prayagraj Sailers Accociation) ప్రెసిడెంట్ పప్పు లాల్ నిషాద్(Pappu Lal Nishad) మాట్లాడుతూ.. రుసుములు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, చాలా సంవత్సరాలుగా పడవ ఛార్జీలను పెంచడం లేదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. బోట్ల ఛార్జీలను పెంచిన తర్వాత, ఇకపై నిర్ణీత ఛార్జీల కంటే ఎక్కువ మొత్తాన్ని భక్తుల నుంచి వసూలు చేయకుండా చూసుకుంటామని అదనపు ఫెయిర్ ఆఫీసర్(Fair officer) తెలిపారు. దీనికిగాను బోటు ఛార్జీల కొత్త జాబితాను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ జాబితాను అన్ని ఘాట్‌లు, పార్కింగ్ స్థలాల్లో అతికించనున్నట్లు తెలిపారు. అయితే, ప్రధాన స్నాన ఘట్టాలు ఉండే ఫెర్రీల్లో మోటారు పడవలపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.
వేల కొద్దీ పడవలు..
మహాకుంభ మేళాను పురస్కరించుకుని కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్టు డిప్యూటీ కలెక్టర్ అభినవ్ పాఠక్(Abhinav pathak) తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని సంగంలో ప్రస్తుతం 1455 బోట్లు నడుస్తున్నాయని, మహాకుంభ మేళా సమయానికి, సమీప జిల్లాల నుండి పడవలు వస్తాయని, దీంతో ఈ సంఖ్య 4,000 దాటవచ్చునని వివరించారు. అయితే, బోట్లను పరిశీలించిన తర్వాత వారికి లైసెన్సులు మంజూరు చేస్తామని తెలిపారు. వారికి లైఫ్ జాకెట్లు(Life Jockets) అందజేయనున్నారు. నావికులందరూ రూ. 2 లక్షల బీమా రక్షణ ప్రయోజనం పొందుతారని తెలిపారు.
Also Read: మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్