Russia-Ukraine War LIVE: రష్యా దాడుల్లో 137 మంది మృతి: ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడి

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ABP Desam Last Updated: 25 Feb 2022 08:36 AM
రష్యా దాడుల్లో 137 మంది మృతి: ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడి

ఉక్రెయిన్​పై రష్యా దాడిని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్​స్కీ తెలిపారు. రష్యా చేపట్టిన దాడుల్లో గురువారం ఒక్కరోజే 137 మంది చనిపోయారు. వీరంతా వార్ హీరోలు అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. పౌరులు, సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. వందలాది సైనికులు, వేలాది పౌరులు గాయపడ్డారని, వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 

70 స్ఖావరాలు

ఉక్రెయిన్​ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేపడుతోంది. ఉక్రెయిన్​లోని 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది రష్యా. ధ్వంసం చేసిన వాటిలో 11 ఎయిర్​ ఫీల్డ్స్​ కూడా ఉన్నట్లు తెలిపింది.


మరోవైపు తాము చేసిన ప్రతిదాడిలో 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.





కుప్పకూలిన విమానం

ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనిక విమానం రాజధాని కీవ్ నగరంలో కుప్పకూలింది. విమానంలో 14 మంది సభ్యులు ఉన్నారు. రష్యా గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది. 

పుతిన్‌దే పూర్తి బాధ్యత

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐరోపా కమిషన్ తీవ్రంగా ఖండించింది. దీనికి పుతిన్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐరోపా కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ హెచ్చరించారు.





ఎమెర్జెన్సీ మీటింగ్

ఉక్రెయిన్- రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. తాజా పరిణామాలను మోదీకి విదేశాంగ శాఖ వివరించనుంది. ఉక్రెయిన్‌లో భారతీయుల క్షేమంపై, యుద్ధం వల్ల భారత్‌పై పడే ప్రభావం గురించి మోదీ చర్చించనున్నారు.

ఆయుధాలు పట్టండి

దేశం కోసం పోరాడలనుకునేవారు యుద్ధం చేయాలని ప్రజలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. ఆయుధాలు పట్టి యుద్ధం రంగంలోకి దిగాలన్నారు.





50 మంది మృతి

50 మంది వరకు రష్యా ఆక్రమణదారులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.





రక్షణ మంత్రి పిలుపు

ఆయుధం పట్టే సత్తా ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ దళాలకు మద్దతుగా రావాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.


పౌరులు మృతి

రష్యా చేసిన దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఏడుగురు పౌరులు మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. 

పశ్చిమ వైపు నుంచి

రష్యా సైన్యం తాజాగా ఉక్రెయిన్ పశ్చిమ వైపు నుంచి కూడా దాడి మొదలుపెట్టింది. బెలారస్ వైపు నుంచి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్ ఏజెన్సీపై దాడులు చేపట్టాయి.





Russia-Ukraine War LIVE: రష్యా కట్టడికి అమెరికా చర్యలు, ఇవాళ జీ-7దేశాల సమావేశం

రష్యా దూకుడు కళ్లెం వేసేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలు పెట్టింది. జీ-7 దేశాలతో కాసేపట్లో సమావేశం కానున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. పుతిన్ ముందస్తు యుద్ధానికి సిద్ధమయ్యారని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడిన బైడెన్‌... పుతిన్ చేష్టలపై తగిన టైంలో స్పందిస్తామన్నారు. ఇది కచ్చితంగా అన్యాయంగా చేస్తున్న దాడిగా అభివర్ణించారు. కలిసి వచ్చే దేశాలతో ఐక్యంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Ukraine Army Chief's Message: మా రక్షక దళాలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి: ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్

‘‘రష్యా సాయుధ దళాలు తూర్పున మా స్థావరాలపై బాంబు దాడులు ప్రారంభించాయి. బోరిస్పిల్, ఓజెర్నోము, కుల్బాకినోము, చుగెవ్, క్రామాటోర్స్క్, చోర్నోబాయివ్ట్సీ సహా ఇతర విమానాశ్రయాలలో రాకెట్ - బాంబు దాడులను కూడా చేశాయి. అదే సమయంలో, రష్ట్రా తమ సరిహద్దు వెంబడి ఉక్రెయిన్ భూభాగం వైపుగా స్థావరాలపై ఫిరంగిలను కూడా ప్రయోగించారు. ఉక్రెయిన్ సాయుధ దళాలు వైమానిక దాడిని ఎదుర్కొంటోంది. రక్షణ దళాలు పూర్తిగా పోరాడేందుకు సంసిద్ధంగా ఉన్నాయి.’’ అని ఎక్రెయిన్ ఆర్మీ చీఫ్ ప్రకటన విడుదల చేశారు.

నేలకూలిన విమానాలు


లుహాన్స్క్‌ ప్రాంతంలో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ మిలటరీ ప్రకటించింది.






 

Air Raid Sirens In Kyiv City: బాండు దాడుల్లో వందల మంది పౌరులు దుర్మరణం!

రష్యా బాంబు దాడులు, ఫిరంగి దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అంతటా నగరాలు దెబ్బతింటున్నాయి. దీంతో గురువారం రాజధాని కైవ్‌లో వైమానిక దాడి హెచ్చరించే సైరన్‌లతో విమానాలు తిప్పినట్లుగా ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. పౌరులు ప్రాణభయంతో భూగర్భంలో ఉన్న మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే బాంబు దాడుల కారణంగా వందల సంఖ్యలో పౌరులు మరణించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

మా లక్ష్యం ఇదే

ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై దాడులు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. సైనిక స్థావరాలు, వసతులు, ఎయిర్‌ డిఫెన్స్, ఉక్రెయిన్ వాయుసేనను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు పేర్కొంది.


అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను వినియోగిస్తున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది.

మార్షల్ లా

ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశంలో మార్షల్ లా విధించారు. పౌరులను, తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.

ఉక్రెయిన్ కీలక నిర్ణయం

దేశంలోని తూర్పున ఉన్న నగరాల్లో ఎయిర్​పోర్టులను మూసివేసింది ఉక్రెయిన్. పౌర విమాన ప్రయాణాల కోసం గగనతల వినియోగాన్ని నిషేధించింది. 

ఖండించిన కెనడా (Canada)

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి సవాల్ విసిరేలా రష్యా చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు రష్యా తూట్లు పొడిచిందన్నారు.



 


ఉక్రెయిన్ స్పందన (Ukraine Reaction)

రష్యా చర్యలపై ఉక్రెయిన్ దీటుగా స్పందించింది. ఉక్రెయిన్‌పై పుతిన్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ఆరంభించారని పేర్కొంది.


" ఉక్రెయిన్‌లో పుతిన్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ఆరంభించారు. కానీ ఉక్రెయిన్ బదులిస్తుంది. విజయం సాధిస్తాం. శాంతియుత ఉక్రెయిన్ నగరాల్లో బాంబుల మోత మోగుతోంది. ప్రపంచం.. పుతిన్‌ను ఆపాలి. ప్రపంచ దేశాలు స్పందించాల్సిన సమయం ఇదే.                                                   "
- ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి

కీవ్‌లో పేలుడు (Explosion)

పుతిన్ ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో పేలుడు జరిగింది. రష్యా సైనిక దళాలే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.





Background

Russia-Ukraine War: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్​లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్​ ద్వారా ప్రసంగించారు పుతిన్.


" ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం మా ప్లాన్ కాదు. ఉక్రెయిన్​లో సైనికీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈ విషయంలో కలగజేసుకోవాలని ప్రయత్నించినా, మా దేశం, ప్రజలకు ముప్పు కలిగేలా ఆలోచనలు చేసినా.. రష్యా వెనువెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. చరిత్రలో ఎన్నడూ జరగని పరిణామాలకు ఇది దారితీస్తుంది.                                                         "
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు










ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు ప్రతిస్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్​ను ఆక్రమించుకోవాలని తమకు ఎలాంటి లక్ష్యం లేదని పుతిన్ పేర్కొన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని చెప్పారు.


ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు చేశారు పుతిన్. రష్యా చేపట్టిన చర్యల్లో తలదూర్చేందుకు ప్రయత్నిస్తే.. 'ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది' అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.


అమెరికా రియాక్షన్







పుతిన్ ప్రకటనపై అమెరికా వెనువెంటనే స్పందించింది. రష్యా చేసే ఈ దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.