Rashtrapatni Row: కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురీ చేసిన 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యలు భాజపాx కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేల్చుతోంది. అయితే పార్లమెంటులో భాజపా నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది
అధీర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై అధికార పక్షం నిరసనలు చేస్తుండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సోనియా గాంధీ సభకు వచ్చారు. అయితే లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడగానే సోనియా గాంధీ.. ట్రెజరీ బెంచ్ వద్దకు వెళ్లారు. ఈ వివాదంలోకి తనను ఎందుకు లాగుతున్నారని అక్కడ ఉన్న భాజపా నేత రమాదేవిని సోనియా గాంధీ అడిగినట్లు సమాచారం.
అయితే అదే సమయంలో స్మృతి ఇరానీ మధ్యలో కలగజేసుకుని.. సోనియా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారట. స్మృతి ఇరానీని ముందు సోనియా పట్టించుకోలేదు. అయితే, కాసేపటికే మంత్రివైపు చూసి 'నాతో మాట్లాడొద్దు' అని సోనియా కోపంగా అన్నారట.
స్మృతి ఇరానీ
" గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ప్రధాని మోదీ.. గిరిజనులకు అత్యుత్నత స్థాయి గౌరవం ఇస్తే.. మీరు ఇంతలా అవమానిస్తారా? అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే."
Also Read: Rashtrapatni Remark: నేను బెంగాలీ, నాకు హిందీ రాదు- క్షమాపణలు మీకు చెప్పను: అధీర్