MPs Suspended From Parliament: పార్లమెంటులో విపక్ష సభ్యుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేశారు.






ఆప్‌ ఎంపీలు సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ సహా స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ భుయాన్‌ను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ వారం పాటు సస్పెండ్ చేశారు.


మొత్తం 27


ఈ ముగ్గురితో కలిపి ఇప్పటివరకు పార్లమెంటు ఉభయసభల్లో 27 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 23 మంది, లోక్‌సభలో నలుగురు సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. 


రాజ్యసభ నుంచి జులై 26 ఒక్కరోజే 19 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. నిరసనలతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వీరిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సస్పెండ్ చేశారు. ఈ వారం చివరివరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు.


లిస్ట్ ఇదే









 



  1. సుస్మితా దేవ్ (TMC)

  2. మౌసమ్ నూర్ (TMC)

  3. శాంత చెత్రి (TMC)

  4. డోలా సేన్ (TMC)

  5. శాంతాను సేన్ (TMC)

  6. అభి రంజన్ బిస్వార్ (TMC)

  7. ఎండీ నదిముల్ హక్ (TMC)

  8. ఎం హమద్ అబ్దుల్లా (డీఎంకే)

  9. బీ లింగయ్య యాదవ్‌ (TRS)

  10. ఎ.ఎ.రహీం సీపీఐ(ఎం)

  11. రవీంద్ర వద్దిరాజు (TRS)

  12. ఎస్.కళ్యాణసుందరం (డీఎంకే)

  13. ఆర్.గిరంజన్ (డీఎంకే)

  14. ఎన్.ఆర్. ఎలాంగో (డీఎంకే)

  15. వి.శివదాసన్ సీపీఐ(ఎం)

  16. ఎం. షణ్ముగం (డీఎంకే)

  17. దామోదర్ రావు (TRS)

  18. సంతోష్ కుమార్ పి (సీపీఐ)

  19. ఎన్వీఎన్ సోము (DMK) 


Also Read: Adhir Ranjan Chowdhury's Remark: రాజుకున్న 'రాష్ట్రపత్ని' వివాదం- అధీర్ వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం


Also Read: Rickshaw Puller Murdered: చపాతీ కోసం చంపేస్తారా? దిల్లీలో దారుణ ఘటన!