Adhir Ranjan Chowdhury's Remark: రాజుకున్న 'రాష్ట్రపత్ని' వివాదం- అధీర్ వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం

ABP Desam Updated at: 28 Jul 2022 12:27 PM (IST)
Edited By: Murali Krishna

Adhir Ranjan Chowdhury's Remark: కాంగ్రెస్ అధీర్ రంజన్ చౌధురీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తుంది.

(Image Source: PTI)

NEXT PREV

Adhir Ranjan Chowdhury's Remark: పార్లమెంట్ ఉభయసభలు రాష్ట్రపతిపై వివాదస్పద వ్యాఖ్యల వివాదంతో స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి 'రాష్ట్రపత్ని' అనటం తీవ్ర వివాదస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలంటూ ఉభయసభలు ప్రారంభం కాగానే భాజపా ఎంపీలు ఆందోళనకు దిగారు.


లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.



గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ప్రధాని మోదీ.. గిరిజనులకు అత్యుత్నత స్థాయి గౌరవం ఇస్తే.. మీరు ఇంతలా అవమానిస్తారా?              - స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి


అటు రాజ్యసభలోనూ రాష్ట్రపతి అంశంపై ఆందోళన రేగింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా ఎంపీ లంతా కాంగ్రెస్ క్షమాపణ చెప్పి తీరాలంటూ డిమాండ్ చేశారు.


సారీ చెప్పను






మరో వైపు అధీర్ రంజన్ చౌధురి పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. కేవలం పొరపాటున మాట్లాడిన మాటపై భాజపా రాద్దాంతం చేస్తోందన్నారు.



నేను మాట్లాడిన మాట తప్పైతే ఉరితీయండి. అంతే కానీ భాజపాకి మాత్రం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు  ప్రదర్శనగా వెళ్తున్నప్పుడు ఆవేశంలో ఓ మాట వచ్చింది. దాన్ని టెలికాస్ట్ చేయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు భాజపా రాద్దాంతం చేస్తోంది.                         - అధీర్ రంజన్ ఛౌదురి, కాంగ్రెస్ నేత


సోనియా గాంధీ స్పందన






ఇదే విషయంపై సోనియా గాంధీని మీడియా ప్రశ్నించగా ఇప్పటికే అధీర్ రంజన్ చౌధురి క్షమాపణ చెప్పారని ఆమె తెలిపారు. మరోవైపు
సోనియా గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమమ్యయారు.


అయితే భాజపా ఎంపీలు పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుతగులుతూ ఆందోళనలకు దిగుతున్నారు. ఇది రాష్ట్రపతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని సోనియా గాంధీ.. ఉభయసభలను ఉద్దేశించి క్షమాపణలు చెప్పేంత వరకూ ఆందోళనలను ఆపమని భాజపా ఎంపీలు చెబుతున్నారు.


Also Read: Rickshaw Puller Murdered: చపాతీ కోసం చంపేస్తారా? దిల్లీలో దారుణ ఘటన!


Also Read: Madhya Pradesh Coivd-19 Vaccine: ఒకే సిరంజితో 30 మంది పిల్లలకు టీకా- షాకైన పేరెంట్స్, వీడియో వైరల్!


 

Published at: 28 Jul 2022 12:25 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.