Madhya Pradesh Coivd-19 Vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన బయటపడింది. ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా ఇవ్వడం కలకలం సృష్టించింది.
ఇదీ జరిగింది
సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నించారు. అయితే దీనికి ఆయన చెప్పిన సమాధానం విన్న అంతా అవాక్కయ్యారు. తన పై అధికారులు ఆదేశాల మేరకే ఇలా చేసినట్టు తెలిపాడు.
ఈ మాటలు విన్న విద్యార్థుల తల్లిదండ్రులు జితేందర్‌తో వాగ్వాదానికి దిగారు. దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ మాటలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది. దీంతో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్ స్పందించారు. చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఒన్ నీడిల్, ఒన్ సిరంజీ, ఒన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యాక్సినేటర్ ఉల్లఘించారని ఆయన అన్నారు. జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. జితేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని కలెక్టర్.. పోలీసులకు సూచించారు.
కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు స్థాయిలో 200 కోట్ల డోసులకుపైగా టీకాలను అందించింది.
Also Read: Mithun Chakraborty On TMC: బంగాల్ రాజకీయంలో 'గోపాల గోపాల'- BJPతో టచ్‌లో 38 మంది TMC ఎమ్మెల్యేలు!
Also Read: Spicejet Flight: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై DGCA సీరియస్- కీలక ఆదేశాలు