Just In





Rickshaw Puller Murdered: చపాతీ కోసం చంపేస్తారా? దిల్లీలో దారుణ ఘటన!
Rickshaw Puller Murdered: చపాతీ ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తిని దిల్లీలో కత్తితో పొడిచి చంపేశాడు ఓ మందుబాబు.

Rickshaw Puller Murdered: రోటీ ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపింది. దిల్లీలోని కరోల్‌బాఘ్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
ఇలా జరిగింది
కరోల్‌బాఘ్‌లో బుధవారం రాత్రి రిక్షాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు. ఫుల్లుగా మద్యం తాగిన మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనకు భోజనం పెట్టాలని అడిగాడు. దీంతో మున్నా అనే వ్యక్తి రోటీ ఇచ్చాడు. అయితే మరో చపాతీ ఇవ్వాలని మందుబాబు డిమాండ్ చేశాడు. అందుకు మున్నా నిరాకరించాడు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన మందుబాబు తన వద్ద ఉన్న కత్తిని తీసి మున్నాను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు మున్నాను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కేసు నమోదు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అనంతరం నిందితుడు ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల ఫెరోజ్ ఖాన్‌గా గుర్తించారు. కరోల్‌బాఘ్‌లోని ఓ పార్క్‌లో నిద్రిస్తోన్న ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Madhya Pradesh Coivd-19 Vaccine: ఒకే సిరంజితో 30 మంది పిల్లలకు టీకా- షాకైన పేరెంట్స్, వీడియో వైరల్!
Also Read: Spicejet Flight: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై DGCA సీరియస్- కీలక ఆదేశాలు