Ramoji Rao Death Telugu News Today: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అస్తమయం
మీడియా దిగ్గజం, తెలుగురాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచుతులైన రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం 4.50 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఈనాడు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ గా ఉన్న రామోజీ రావు..ఈనెల 5న గుండె సంబంధిత సమస్యలతో హైదారాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి క్రిటికల్ సిచ్యుయేషన్ లో చికిత్స పొందుతున్న తెల్లవారుజామున కన్నుమూసినట్లు ఈనాడు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు - ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramojirao) జూన్ 9న (ఆదివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పార్ధీవ దేహాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి తరలివచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అటు, ఈనాడు సంస్థల ఉద్యోగులు, సిబ్బంది సైతం ఆయన పార్ధీవ దేహానికి నివాళి అర్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్ఎస్ పునరుజ్జీవానికి కేసీఆర్ వద్ద ఉన్న ప్లాన్లేంటి ? వలసల్ని ఆపగలరా ?
రాజకీయాలంటే  ఎప్పుడూ విజయాలు ఉండవు. కానీ గట్టిగా ప్రయత్నించకపోతే ఎప్పుడూ అపజయాలు ఉంటాయి. వరుస ఓటములు వస్తే మరోసారి ప్రయత్నించడానికి కూడా అవకాశం రానంత స్థితికి పార్టీలు వెళ్లిపోతాయి.  పరిస్థితి బాగున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా  కలసి వస్తుంది. పార్టీ నేతల్ని చాణక్యుడని పొగుడుతారు.   కలసి రానప్పుడు  ఏ నిర్ణయం తీసుకున్నా రివర్స్ అవుతుంది. కేసీఆర్ పధ్నాలుగేళ్ల పాటు చాణక్యునిగా పేరు తెచ్చుకున్నారు.  అన్ని నిర్ణయాలు కలసి వచ్చాయి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన రామోజీరావు జీవితం స్ఫూర్తిదాయకం- రాష్ట్రపతి సహా ప్రముఖుల ఘన నివాళి
రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత దేశ మీడియా రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని అన్నారు. ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ఫిల్మ్‌సిటీని స్థాపించి స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. ఆయన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణ్ దక్కిందని వెల్లడించారు. మీడియాకి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళి
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) పార్థీవదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భువనేశ్వరి రామోజీరావు కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. రామోజీరావు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి