Krishna Mukunda Murari Today Episode మిత్ర అర్ధరాత్రి అర్జున్ ఇంటికి వెళ్తాడు. ఈ టైంలో ఎందుకు వచ్చావ్ అని అర్జున్ అడిగితే నా కూతురిని తీసుకెళ్లాలి అని మిత్ర అంటాడు. నిద్ర డిస్ట్రబ్ అవుతుందని అర్జున్ చెప్పినా వినకుండా పాపని తీసుకురమ్మని చెప్తాడు. అర్జున సరే అని వెళ్తాడు. మెళ్లగా పాపని ఎత్తుకొని తీసుకెళ్తుంటాడు. లక్ష్మీ నిద్ర లేచి అడిగితే పాపని ఇచ్చేసి వస్తాను అని అంటాడు. లక్ష్మీ కూడా వస్తాను అని వెనకాలే వెళ్లాలి అనుకుంటుంది. కానీ జున్ను లక్ష్మీ చీర పట్టుకొని ఉండటంతో మిత్ర దగ్గరకు వెళ్లడం లేటు అవుతుంది. దీంతో మిత్రను లక్ష్మీ చూడదు. 


ఉదయం అరవింద దగ్గరకు భాస్కర్‌ వస్తాడు. అరవింద మిత్ర పని మీద పంపాడని అందుకే వచ్చాను అని అంటాడు. ఇక మనీషా, దేవయాని గురించి అడుగుతాడు. తన చెల్లి గురించి మనీషా అడిగింది అని అంటాడు. అరవిందలో అనుమానం వస్తుంది. భాస్కర్‌కు అరవింద తన ప్రశ్నలు అడుగుతుంది. ఇంతలో మనీషా తమ గుట్టు  రట్టు చేసేలా ఉన్నాడని వచ్చి అడ్డుకుంటారు. తర్వాత మాట్లాడుకుందామని పంపేస్తుంది. ఇక మనీషా వెళ్లిపోతుంటే అరవింద ఆపుతుంది. 


అరవింద: ఆగిపోయిన కథ రాయడానికి నిలిచిపోయిన రథం లాగడానికి ప్రయత్నిస్తున్నారు అంట. భాస్కర్ వాళ్ల చెల్లి గురించి ఆరా తీస్తున్నావ్ అంట. ఎందుకు.
మనీషా: ఏంలేదు ఆంటీ లక్కీకి రక్త సంబంధం ఉండాలి. కదా ఏదో ఒక రోజు తను కూడా తల్లి కావాలి అంటుందని ఆవిడ దొరికే అవకాశం ఉందేమో అని అడిగాను.
అరవింద: చూడు మనీషా మిత్రకు లక్కీకి రక్త సంబంధం లేకపోయినా అంత కంటే మంచి సంబంధం ఏర్పడింది. లక్కీకి తల్లిని దూరం చేసినా మిత్రను దగ్గర చేశాడు. లక్కీ తల్లి వస్తుంది లక్కీని తీసుకెళ్తాడు అని అనుకోవద్దు అలాంటి ఆలోచన కూడా రానివ్వద్దు.
దేవయాని: చూడు అక్క ఈ అరువు సంబంధాలు వద్దు. మనీషా, మిత్రలకు పెళ్లి చేసేస్తే వీళ్లకి పిల్లలు పుడతారు.
అరవింద: ఈ విషయం ముందే చెప్పాను మిత్ర మనీషాను ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేస్తా లేదంటే ఆ ఊసే వద్దు. 
మనీషా: చూశారా ఆంటీ ఏదో ఒక రోజు మిత్రని జీవితంలో నుంచి నన్ను తప్పించాలి అని చూస్తున్నారు. 


మిత్ర పాపని తీసుకొని స్కూల్‌కి కారులో వెళ్తుంటాడు. ఇక మిత్రకు కారులో నుంచి మంటలు వచ్చినట్లు గురువుగారికి కనిపిస్తుంది. విషయం చెప్పాలి అని మిత్రకి కాల్ చేస్తే ఫోన్ కలవదు. జున్నుకి దగ్గర అయిపోతుంది అని లక్కీని స్కూల్ మార్పించాలి అని అనుకుంటాడు. మిత్ర కాల్ చేస్తారు దీక్షితులుగారు. కానీ మిత్ర లిఫ్ట్ చేయడు. పాపని స్కూల్‌లో దింపేస్తాడు. ఇక మిత్రకు గండం రాబోతున్న సంగతి దీక్షితులు గారు అరవిందకు కాల్ చేసి ఉన్నపళంగా మిత్రని ఇంటికి తీసుకురమ్మని చెప్తారు. మిత్ర కారు నడపకూడదని చెప్తారు. రెండు మూడు రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు అని చెప్తారు.  అరవింద ఆ విషయం వివేక్‌కు చెప్తుంది. వివేక్ కంగారు పడతాడు. ఫోన్ చేస్తాను అంటాడు. 


మరోవైపు మిత్ర స్కూల్‌ మార్చడంపై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడుతాడు. లక్కీ డల్ అయిపోతుంది. తనకి ఇక్కడే ఉండాలి అని ఉందని చెప్తుంది. మిత్ర చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అని అరవింద కంగారు పడుతుంది. దేవయాని, మనీషా కూడా షాక్ అవుతారు. మరోవైపు లక్ష్మీ కూడా జున్నుని తీసుకొని స్కూల్‌కి వస్తుంది. లక్కీని డల్‌గా ఉండటం లక్ష్మీ చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: గంగలో కలిసిన డీబీఎస్టీ కాలేజీ పరువు - రిషి సార్ చనిపోలేదన్న వసు.. షాక్‌లో మహేంద్ర, మను