Guppedanta Manasu  Serial Today Episode: ఈ మధ్య తన జాతకం బాగుందని అన్నీ కలిసి వస్తున్నాయని శైలేంద్ర దేవయానితో చెప్తూ హ్యాపీగ ఫీలవుతుంటే ఇంతలో ఫణీంద్ర వస్తాడు. ఎందుకు కలసి వస్తున్నాయి. నువ్వు కాలేజీలో చేసిన ఘనకార్యం తెలిసింది. అంటూ శైలేంద్రను తిడతాడు. ఎన్నిసార్లు  చెప్పినా నువ్వు మారవారా? నేను ఏం చెప్పిన పెడ చెవిన పెట్టడం అసలు మనిషి లక్షణాలు ఒక్కటన్నా ఉన్నాయారా? అంటాడు. ఇంతలో దేవయాని కలగజేసుకుని ఏం చేశాడని అడుగుతుంది. వాడు నీకు తెలియకుండా చేస్తాడా? అంటూ పశువు కన్నా పది సార్లు చెబితే మారుతుంది. మీకు ఎన్ని సార్లు  చెప్పినా మారరా? అంటూ తిట్టి వెళ్లిపోతాడు. ధరణి కూడా సెటైర్లు  వేసి వెళ్తుంది.


శైలేంద్ర: మామ్‌ ముందు దీన్ని తప్పించాలి. అన్ని విషయాలు  డాడ్‌కి చేరవేస్తుంది ఇదే.. ఇప్పుడు కూడా నేను చేసింది డాడ్‌కు చెప్పింది ఇదే


దేవయాని: ఇంతకీ నువ్వు ఏం చేశావురా?


శైలేంద్ర: వసుధార పేపర్‌లో ప్రకటన ఇచ్చింది కదా అందులోని నెంబర్ కు ఫోన్‌ చేసి..


 అని శైలేంద్ర, పుల్లయ్యలాగా వసుధారకు ఫోన్‌ చేసింది మొత్తం చెప్తాడు. దీంతో దేవయాని హ్యాపీగా ఫీలవుతుంది. మొన్న వాళ్లు నన్ను ఆడుకుంటే నిన్న వాళ్లను ఓ ఆటాడుకున్నాను అంటాడు శైలేంద్ర. మరోవైపు వసుధార, రిషిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. లోకాన్ని జల్లెడ పట్టైనా సరే మీ జాడ కనుక్కుంటాను  అనుకుంటుంది. తర్వాత కాలేజీకి చెకింగ్‌ ఆఫీసర్స్‌ వస్తారు. వాళ్లతో శైలేంద్ర ఈ కాలేజీలో ఏ వసతులు లేవని చెప్తాడు. మా తమ్ముడు చదువుతున్నాడని వాణ్ని పిలుస్తాను మీరే  అడగండి అని చెప్పి ఒక స్టూడెంట్‌ ను పిలిచి ఈ కాలేజీ గురించి చెప్పు అనగానే ఈ కాలేజీలో ఏ వసతులు లేవని ఆ స్టూడెంట్‌ చెప్తాడు. దీంతో చెకింగ్‌  ఆఫీసర్లు వెళ్లిపోతారు. తర్వాత డీబీఎస్టీ కాలేజీకి ఎగ్జామ్‌  సెంటర్‌ రిజెక్టు చేశారని తెలిసి వసుధార బాధపడుతుంది.


మహేంద్ర: వసుదార ఏమైందమ్మా ఎందుకలా  ఉన్నావు.


మను: మేడం రిషి సార్‌ గురించి ఏమైనా తెలిసిందా? ఏంటో చెప్పండి మేడం ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు.


వసు:  మన కాలేజీకి ఎగ్జామినేషన్‌ సెంటర్‌ క్యాన్షిల్‌ చేశారు.  


మను: వాట్‌ మన కాలేజీకి ఎగ్జామినేషన్‌ సెంటర్‌ క్యాన్షిల్‌ చేయడం ఏంటి?


మహేంద్ర: ఏంటి అమ్మా ఇదంతా.. డీబీఎస్టీ కాలేజీలో ఎగ్జామినేషన్‌ సెంటర్‌ లేకపోవడం ఏంటి? అసలు ఇలా ఎందుకు జరిగింది.


అంటూ ముగ్గురూ ఇదే విషయంపై చర్చించుకుంటారు. వెంటనే మహేంద్ర, మినిస్టర్‌కు ఫోన్‌ చేస్తాడు. మన కాలేజీకి ఎగ్జామినేషన్‌  సెంటర్‌ ఇవ్వలేదని చెప్తాడు. లిస్ట్‌  ఫైనల్‌ అయ్యాక నేనేం చేయలేనని నేను కాలేజీకే వస్తున్నానని అక్కడికి వచ్చాక మాట్లాడదాం అని చెప్తాడు.


మినిష్టర్: ఏంటి వసుదార ఇది ఎందుకు ఇదంతా..?


వసు: రిషి సార్‌ కనిపించడం లేదని ప్రకటన ఇచ్చాను సార్‌.


మినిస్టర్: ఆ విషయం నాకు తెలుస్తుందమ్మా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతున్నాను.


వసు: ఆచూకి తెలిసిన వాళ్లు ఎవరైనా చెప్తారని ఇలా చేశాను సార్‌.


మినిస్టర్: ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది. చనిపోయిన వ్యక్తి గురించి ఆచూకి తెలియడమేంటి?


వసు: సార్‌  రిషి సార్‌ చనిపోలేదు.


అనగానే మినిస్టర్ షాక్‌ అవుతాడు. చనిపోలేదని నీకెవరు చెప్పారని అడగ్గానే నా మనస్సాక్షి చెప్తుంది అని వసుధార చెప్పడంతో.. రిషి మీద ఉన్న ప్రేమతో వసుధార అలా మాట్లాడుతుందని రిషి చనిపోయినప్పటి నుంచి వింతగా మాట్లాడుతుందని శైలేంద్ర చెప్తాడు. దీంతో మినిస్టర్ వసుధారను రిషి చనిపోయాడని కన్వీన్స్  చేయాలని చూస్తాడు. దీంతో వసుధార ఒప్పుకోదు. రిషి సార్‌ బతికే ఉన్నాడని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: పవన్‌ గురించి చెప్పమంటూ ఫ్యాన్స్‌‌ రిక్వెస్ట్‌ - నేరుగా ఆయనకే ఫోన్‌ చేసి మాట్లాడతా, రేణు దేశాయ్‌ కామెంట్స్‌