Trinayani Today Episode హాసిని తిలోత్తమ గ్లౌజ్ ఉన్న కుడి చేతిని పట్టుకోవడంతో చేయి వణుకుతూ తిలోత్తమ కోపంతో అరుస్తూ హడావుడి చేస్తుంది. తర్వాత నిమ్మకాయ పిండి మంత్రాలు చెప్తుంది. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నిమ్మకాయలు కోసి చేతి మీద ఎందుకు పెట్టుకున్నారు. మంత్రాలు ఎందుకు చెప్పుకున్నారు అని నయని తిలోత్తమను అడుగుతుంది. చేయి పట్టి లాగడంతో మంట పుట్టి అలా చేశాను అని అంటుంది. గాయం మీద నిమ్మకాయ చల్లితే ఇంకా మంట పుడుతుందని విశాల్ అంటే నాకు అలా చేస్తే చాలా హాయిగా ఉంటుందని తిలోత్తమ అంటుంది.
విక్రాంత్: అసలు ఆ గాయం ఎలా అయిందో మాకు చూపిస్తే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం కదా అమ్మ.
తిలోత్తమ: అవసరం లేదు. ఈ గాయం దానికి అదే తగ్గిపోవాలి అన్నారు.
సుమన: ఎవరు అన్నారు అత్తయ్య.
తిలోత్తమ: శ్రేయాభిలాషలు. మీరు భోజనం చేయండి.
విశాల్: అమ్మ చాలా వింతగా ప్రవర్తిస్తుంది.
నయని: అవును బాబుగారు.
హాసిని: శుక్లాం బరధరాం అని కూడా చెప్పలేదు అన్న మంత్రాలు ఎలా చెప్పిందా అని డౌట్.
విక్రాంత్ హడావుడిగా లోపలికి వస్తాడు. సుమన కూడా వెనకే వచ్చి అంత హడావుడిగా ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దానికి విక్రాంత్ సర్పదీవి నుంచి వచ్చిన అమ్మే అలా ప్రవర్తిస్తే ఉలూచి ఇంకా ఎలా ప్రవర్తిస్తుందా అని చూడటానికి వచ్చా అంటాడు. చిన్న పిల్ల ఏం చేస్తుందని సుమన అంటే.. విక్రాంత్ హాసిని వదిన అమ్మ చేయి ముట్టుకోవడంతో అమ్మ ఎంత రౌద్రంగా మారిపోయిందో చూశావా అని అంటాడు.
విక్రాంత్: అలా ఎందుకు చేసిందో లోతుగా ఆలోచించాలి సుమన. ఇదిగో చూడు అమ్మ చేతికి గ్లౌజ్, ఉలూచి కాళ్లకు సాక్స్‌లు. వీళ్ల ఇద్దరికే ఎందుకు ఇలా అని ఆలోచించాలి.
సుమన: లేదు పిల్లకు బట్టలు మార్చినప్పుడు కూడా ఉలూచికి సాక్స్‌లు మార్చాలి అని ప్రయత్నించాను. ఉలూచి ఏడ్చింది. పాపని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆ సాక్స్‌లు అలాగే ఉంచి వేరే డ్రస్ వేశాను.
విక్రాంత్: తీయాలి అని చూస్తే ఏడ్చిందా ఎందుకు అలా. ఏదో ఉంది.. అసలు దేవుడికి రెండు చేతులతో దండమే పెట్టని అమ్మ మంత్రాలు చదివింది అంటే ఏమనుకోవాలి. సడెన్‌గా డబ్బు వచ్చింది అంటే ఎవరైనా ట్రాన్షఫర్ చేయొచ్చు. లేదంటే దొంగతనం చేయొచ్చు. కానీ మంత్రాలు రావు కదా. అందులో అలా ఆరి తేరినట్లు ఉంది.
సుమన: ఉలూచిని కూడా అనుమానించేలా ఉన్నారు. వెళ్లండి.
విక్రాంత్: సుమన చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మా అమ్మతో. ఈ మాట బాగా గుర్తు పెట్టుకో.
హాసిని, నయని, విశాల్‌లు తిలోత్తమ చేతి గురించి మాట్లాడుకుంటారు. పది రోజుల్లో అంత బలంగా ఎలా మారిందో అర్థం కావడం లేదు అనుకుంటారు. ఆ చేతి వెనక ఏదో ఉందని అనుకుంటారు. నయని ఆ మంత్రాలు ఎక్కడో విన్నాను అని కానీ గుర్తు రావడం లేదు అని అంటుంది. ఇక విశాల్ ఆ మంత్రాలు ఎందుకు పఠిస్తారో తెలుసుకుంటే తిలోత్తమ ఆలోచనలు తెలుసుకోవచ్చు అని అనుకుంటారు.
తిలోత్తమ గయత్రీ దేవి ఫోటొ ఎదురుగా నిల్చొంటుంది. దురంధర, హాసిని, సుమనలు చూస్తారు. ఆ ఫోటొని ఎందుకు చూస్తున్నారు అని అని అడుగుతారు. ఇక మిగతా వాళ్లు అక్కడికి వచ్చి చేయి గురించి అడుగుతారు. తిలోత్తమ వాటిని మర్చిపోమని అంటుంది. ఇక నయని కొన్నింటిని గుర్తుంచుకోవాలి అని అంటుంది. ఏంటని తిలోత్తమ అంటే ఎల్లుండి గాయత్రీ దేవి వర్ధంతి అని నయని అంటుంది. ఇక తిలోత్తమ గాయత్రీ పాపని చూసి ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నాతో ఆడుకోవడానికి రాలేదు అని అంటుంది. దీంతో హాసిని వస్తే నువ్వు ఉండవని అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. విశాల్ కవర్ చేస్తాడు. సర్పదీవికి గాయత్రీ, ఉలూచిలను తీసుకెళ్లిన నాటి నుంచి చిన్నపిల్లల మీద అటాచ్ మెంట్ పెరిగిందని తిలోత్తమ అడుగుతుంది. తిలోత్తమ ఎత్తుకుంటాను అనగానే హాసిని నోరెళ్లబెడుతుంది. విశాల్ కంగారు పడతాడు. తిలోత్తమ దగ్గరకు వెళ్లదు. దీంతో దురంధర గాయత్రీని వదిన టచ్ చేస్తే గుర్తు పడుతుందని అంటుంది. విశాల్ వద్దు అంటాడు. గాయత్రీ పాపతో నయని తిలోత్తమకు షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంది. గాయత్రీ తిలోత్తమ గ్లౌజ్ ఉన్న చేతిని ముట్టుకున్నా తిలోత్తమకు ఏం కాదు. గ్లౌజ్ తీసి షేక్ హ్యాండ్ ఇవ్వు అమ్మ అని విక్రాంత్ అంటే విక్రాంత్‌ని తిలోత్తమ తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'నాగ పంచమి' సీరియల్: కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లపోతామన్న మోక్ష.. కరాళి ఆధీనంలో వైశాలి, ఘన!