Naga Panchami Today Episode మోక్ష నాగ సాధువుని కలిసి ఇంటికి వస్తాడు. మోక్ష బాధగా ఉండటం చూసి వైదేహి ఏమైందని ప్రశ్నిస్తుంది. పిల్లల విషయంలో ఏదో విషయమై నువ్వు పంచమి మధన పడుతున్నారని అంటుంది. మాకు తెలీకూడనంత రహస్యం ఏముంటుందని మా సందేహం అని వైదేహి ప్రశ్నిస్తుంది. పంచమి అలాంటి రహస్యాలు ఏమీ లేవు అని తమకు దేవుడు బంగారం లాంటి పిల్లల్ని ప్రసాదించాడని చెప్తుంది. 


 చిత్ర: మీరు ఎంత దాచాలి అనుకున్నా మా దగ్గర దాయలేరు. ఇద్దరు పిల్లలకు రక్షలు కడుతూ వాళ్ల జాగ్రత్తల కోసం ఏవేవో చేస్తున్నారు. అదంతా మేం గమనిస్తూనే ఉన్నాం.
మోక్ష: మాకు మా పిల్లలకు ఎలాంటి కష్టం వచ్చిన ఆ భారం మీ మీద వేయం. దయచేసి ఏవేవో అపోహలు సృష్టించకండి. 
పంచమి: మా పిల్లలకు ఇప్పుడిప్పుడే ఊహ తెలిసి అన్నీ అర్థమవుతాయి. వాళ్ల దగ్గర ఏవేవో మాట్లాడి వాళ్ల పసి మనసులు గాయం చేయకండి. ఇంకోసారి మా పిల్లల ప్రస్తావన తీసుకురాకండి.
జ్వాల: ఇళ్లు అన్నాక అన్నీ ప్రస్తావించాల్సి ఉంటుంది. నీలాగే నీ పిల్లలకు కూడా శక్తి లాంటివి ఉంటే అవి నా కొడుకుకు ప్రమాదం కావొచ్చు. నీకు పాముల భాష తెలిసినట్లే నీ పిల్లలకు ఎన్ని మాయలున్నాయో మాకు ఎలా తెలుసు. 
మోక్ష: మీకు అలాంటి అనుమానాలు ఉంటే మాకు మా పిల్లలకు దూరంగా ఉండండి. కానీ ఏవేవో ముద్రలు వేయకండి.
వైదేహి: నేను మీ డాడీ ఓ నిర్ణయానికి వచ్చాం మోక్ష. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. కలిసి ఉండి ఇలా రోజు గొడవలు పడి మీరు శత్రువులు అవ్వడం మాకు ఇష్టం లేదు. మాకు కష్టంగా ఉన్నా ఎవరి భాగం వారికి పంచి ఇస్తాం. మీరు విడిగా బతుకుతూ ఉన్నా బంధువులుగా కలిసి ఉండండి. 
జ్వాల: అప్పుడే వద్దు అత్తయ్య గారు మోక్ష పిల్లల విషయం తేలిన తర్వాత పంచుకుందాం. 
వైదేహి: మళ్లీ అలాంటి పేచీలు పెట్టకండి.
మోక్ష: అమ్మా నాకు ఇలాంటి ఆస్తిపాస్తులు మీద ఎలాంటి ఇష్టం లేదు. రేపు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి ఈ ఇంటి నుంచి వెళ్లిపోతాం. ఈ ఆస్తిలో మాకు ఒక్క పైసా అక్కర్లేదు. మేం ఎక్కడ ఉంటామో కూడా మీకు తెలీకూడదు. 
వైదేహి: మోక్ష మేం ఏం చెప్తున్నాం నువ్వు ఏం అంటున్నావ్.
మోక్ష: రేపు పూజ అవ్వగానే మేం వెళ్లిపోతాం. దయచేసి ఆ పూజకు ఎలాంటి ఆటంకం కలిగించకండి.
వైదేహి: ఏంటి అత్తయ్య మోక్ష అలామాట్లాడుతున్నాడు. వాడిని వాడి పిల్లల్ని చూడకుండా నేను ఉండలేను. ఈ ఆస్తి ఎవరికైనా ఇచ్చేయండి కానీ వాళ్లు వెళ్లిపోవడానికి వీల్లేదు.


వరుణ్, భార్గవ్‌లు కూడా వైదేహి దగ్గరకు వచ్చి వాళ్లని పంపిచొద్దు అని అందరం కలిసి ఉంటేనే మాకు ఇష్టమని అంటాడు. ఇక మోక్ష, పంచమి పడుకున్న పిల్లల్ని చూస్తూ బాధ పడతారు. నాగ సాధువు చెప్పింది మోక్ష పంచమికి చెప్తాడు. వైశాలిని ఒక్కర్తిని పంపించడానికి వీల్లేదు అని నాలుగురం కలిసే ఎక్కడికైనా వెళ్లాలి అని లేదంటే నలుగురం కలిసే చావాలి అంటాడు. తన తండ్రికి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని చెప్పానని చెప్తాడు. అంతా నీ మీదే ఆధారపడి ఉందని నీకు శివయ్య ఆశీస్సులు నిండుగా ఉన్నాయని నువ్వే మన పిల్లల్ని కాపాడాలి అని మోక్ష పంచమితో చెప్తాడు. 


మరోవైపు కరాళి తన మంత్ర శక్తిని ఘనా మీదకు ప్రయోగిస్తుంది. దాంతో ఘనా లేచి నడిచి వెళ్తుంటాడు. ఇక కరాళి వైశాలి మీద శక్తి ప్రయోగించడంతో వైశాలి కూడా ఘనా వెనకాలే అడవి గుండా వెళ్తుంది. ఇక ఫాల్గుణి లేచి చుట్టూ చూస్తుంది. అక్క  అక్క  అని పిలుస్తుంది. పంచమి, మోక్షలను లేపి వైశాలి లేదు అని చెప్తుంది. ఇద్దరూ షాక్ అవుతారు. అంతా వెతుకుతారు. మరోవైపు జ్వాల కూడా చూసి ఘనా లేకపోవడంతో మొత్తం వెతుకుతుంది. వైశాలి, ఘనల కోసం అందరూ వెతుకుతారు. మెయిన్ డోర్ తెరిచి ఉందని ఇద్దరు ఎక్కడికో వెళ్లారు అని అనుకుంటారు. జ్వాల వైశాలి మీద నిందలు వేస్తుంది. ఏదో మాయో మంత్రమో లేకపోతే వాళ్లిద్దరూ ఎలా వెళ్తారు అని చిత్ర అంటుంది. జ్వాల పంచమి, మోక్షల మీద పడుతుంది. అందరూ తలో వైపో వెతుకుతారు. ఇక మోక్ష ఎలాంటి పరిస్థితుల్లోనూ రేపు పూజ ఆపొద్దని పంచమితో చెప్తాడు. పిల్లలు కనిపిస్తారు అని అంటాడు. పిల్లలు ఇద్దరూ కరాళి దగ్గరకు వెళ్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, భయంగా ఉంది - ఎట్టకేలకు స్పందించిన శ్యామల