కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయం చేస్తారని అనుకుంటున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ప్రియాంకా గాంధీ నాయకత్వ లక్షణాలను చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నట్లుగా పీకే ఓ ఇంటర్యూలో చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ రాహుల్‌పై మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఆ వ్యాఖ్యలతో పాటు భారతీయ జనతా పార్టీని విపరీతంగా పొగిడారు. 


Also Read : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు


ఇటీవల గోవాలో ఓ రాజకీయ పరమైన చర్చాగోష్టి జరిగింది. దీనికి ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. బీజేపీ గెలిచినా ఓడినా  వచ్చే మూడు, నాలుగు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ఆ పార్టీది కీలక పాత్రని విశ్లేషించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించడం లేదన్నారు. బీజేపీ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో పోల్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్వాతంత్యం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు  భారత రాజకీయాల్లో  కాంగ్రెస్‌ ఎలా స్ట్రాంగ్‌గా ఉందో..  వచ్చే 30, 40 ఏళ్లు  బీజేపీ అలాగే ఉండబోతోందని స్పష్టం చేశారు. 


Also Read : యోగీ మార్క్‌ ట్రీట్‌మెంట్‌..! పాక్‌ విజయానికి వేడుకలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు


ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆగ్రహంతో ప్రజలు  తిప్పికొడతారని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుగా పీకే చెప్పుకొచ్చారు. ఒక వేళ మోడీని  జనం తిరస్కరించినా.. బీజేపీ ఎక్కడికీ పోదన్నారు. మోడీ బలాన్ని అర్థం చేసుకని, అవగాహన చేసుకోనంతవరకు ఆయనను ఓడించడం అసాధ్యమన్నారు. ఇది రాహుల్‌ గాంధీ గ్రహించాలని ప్రశాంత్‌ కిషోర్ వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 





Also Read : రాజకీయాల్లోకి వీవీఎస్ లక్ష్మణ్ ! బీజేపీ మైండ్ గేమా ? నిజమా ?


బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి స్ట్రాటజిస్ట్‌గా పని చేసిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీకి పని చేయబోనని ప్రకటించారు. అప్పుడే కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో చేరి.. చనిపోయిన అహ్మద్ పటేల్ పాత్ర పోషించాలని ఆశించారు. అయితే కాంగ్రెస్ సీనియర్లు.. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయన పట్ల ఆసక్తిగా లేరన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాహుల్‌పై ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూసుకుంటున్నారు. 


Also Read: Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి