ముంబయి డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. ఆర్యన్ ఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు.
ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధామేచాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ కేసు..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Also Read: Cruise Chip Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసు అప్‌డేట్.. కీలక సాక్షి గోసవీ అరెస్ట్
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!
Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?
Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి