ABP  WhatsApp

Air Pollution Reduces Sperm Count: వాయు కాలుష్యం వల్ల ఆ కౌంట్ తగ్గిపోతుందట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు!

ABP Desam Updated at: 28 Oct 2021 01:48 PM (IST)
Edited By: Murali Krishna

వాయుకాలుష్యం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. పూర్తి వివరాలు మీరే చూడండి.

వాయు కాలుష్యం వల్ల ఆ కౌంట్ తగ్గిపోతుందట!

NEXT PREV

కాలుష్యంతో జరిగే అనర్థాలు మన అందిరకీ తెలిసనవే. కొంతమందికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోస సంబంధ వ్యాధులు వస్తే చాలామందికి జుట్టు రాలిపోతుంది. అయితే తాజాగా యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (UMSOM)లో పరిశోధనకర్తలు.. కాలుష్యం వల్ల కలిగే మరో నష్టం గురించి చెప్పారు. అదేంటో తెలుసా? స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాలు) తగ్గిపోవడం. అవును.. కాలుష్యం కారణంగా మెదడులో ఉద్రేకం కలిగి తద్వారా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట.


ఇది ఎలా?


బ్రెయిన్‌కు మన రిప్రోడక్టివ్ ఆర్గన్స్‌కు డైరెక్ట్ కనెక్షన్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మెదడుకు కనుక ఒత్తిడి కలిగితే ఆ ప్రభావం మన పునరుత్పత్తి అవయవాలు, స్పెర్మ్ కౌంట్‌పైన కచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకు.. భావోద్వేగపూరితమైన ఒత్తిడి కలిగితే మహిళల్లో నెలసరి వచ్చే సమయాల్లో మార్పులు వస్తాయి. అయితే తాజా అధ్యయనంలో వాయుకాలుష్యం కారణంగా ఫలదీకరణలో జరిగే మార్పులపై పరిశోధన చేశారు. 'ఎన్వీరాన్‌మెంటల్ హెల్త్ పెర్స్‌పెక్టివ్స్‌' అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.



మేం చేసిన అధ్యయనం ప్రకారం వాయు కాలుష్య ప్రభావం స్పెర్మ్ కౌంట్‌పై కచ్చితంగా ఉంటుందని తేలింది. అయితే కొన్ని రకాల థెరపీల ద్వారా దీని వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు.                                          -     జెకాంగ్ ఇంగ్, అధ్యయన కర్త


వాయు కాలుష్యం ప్రభావం కేవలం ఫలదీకరణపైనే కాదు రక్తపోటు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణం అవ్వొచ్చని కార్డియాలజీ స్పెషలిస్ట్ ఛార్లెస్ హాంగ్ తెలిపారు.


వాయు కాలుష్యంలోనే..


ప్రపంచంలో దాదాపు 92 శాతం మంది జనాభా.. వాయువులో కనీస భద్రతా ప్రమాణాలు లేని ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఫ్యాక్టరీలు, వాహనాలు, కార్చిచ్చు వంటి వాటి నుంచి వచ్చే కాలుష్యపు కోరల్లోనే బతుకున్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.


గతంలో కూడా వీటిపై పరిశోధనలు జరిగాయి. ఎలుకలపై చేసిన పరిశోధనలో వాయుకాలుష్యం వల్ల వాటి ఫలదీకరణ శక్తి తగ్గుతున్నట్లు తేలింది. బ్రెయిన్‌కు జననాంగాలకు డెైరెక్ట్ కనెక్షన్ ఉండటం వల్ల వాయుకాలుష్య ప్రభావం స్పెర్మ్ కౌంట్‌పై పడుతుందని తేల్చారు.


తాజా పరిశోధనలో..


తాజాగా చేసిన ఈ అధ్యయనంలో ఆరోగ్యమైన ఎలుకలు, వాటి పిల్లలపై పరిశోధన చేశారు. వాటి మెదడులోని న్యూరాన్లలో ఐకేకే2 లోపం ఉన్నఎలుకలు, సహా ఆరోగ్యమైన ఎలుకలను వాయు కాలుష్యానికి గురయ్యేలా చేశారు. అనంతరం వాటి స్పెర్మ్ కౌంట్‌ను పరీక్షించారు. ఐకేకే2 లోపం లేని ఎలుకల్లో స్పెర్మ్ కౌంట్‌ సాధారణంగానే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాటిలో స్లీప్ సైకిల్, ఒబేసిటీకి కారణమైన ఓ న్యూరాన్‌ వల్లే స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్లు తేలింది. దీనికి వాయు కాలుష్యమే కారణమని గుర్తించారు.


బ్రెయిన్‌లో ఉండే హైపోథాలమస్ పార్ట్.. మనలోని ఆకలి, దాహం, సెక్స్ కోరికలను ఆపరేట్ చేస్తుంటుంది. ఈ హైపోథాలమస్.. బ్రెయిన్‌లోని పిట్యుటరీ గ్లాండ్‌తో కూడా కలిసి పనిచేస్తుంది. రిప్రోడక్టివ్ ఆర్గన్స్‌తో డైరెక్ట్‌గా ఇది కమ్యూనికేట్ చేస్తుంది.


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!


Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?


Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్‌ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 28 Oct 2021 01:45 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.