Imran Khan Toshakhana Case:


ఈ కేసులో అరెస్ట్..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకున్నారు. లాహోర్‌లోని జమన్ పార్క్‌లోని ఆయన ఇంటిని మొహరించారు. తొషకన కేసులో ఆయనను అరెస్ట్ చేయనున్నట్టు పాక్ మీడియా వెల్లడించింది. ఈ కేసు విచారణకు కోర్టులో హాజరవ్వాల్సి ఉన్నా ఇమ్రాన్ పట్టించుకోలేదు. అందుకే పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే PTI కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. లాహోర్ పోలీసుల సహకారంతో ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయనున్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 28న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అడిషనల్ సెషన్స్ జడ్జ్. చట్టపరమైన ప్రొసీడింగ్స్ పూర్తైన వెంటనే ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయనున్నారు. అయితే PTI వైస్ ప్రెసిడెంట్‌ ఫవద్ చౌద్రి దీనిపై స్పందించారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 


"ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న దేశాన్ని మరో సంక్షోభంలోకి నెట్టొద్దని ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం సెన్సిబుల్‌గా వ్యవహరించాలి"


-ఫవాద్ చౌద్రి, పీటీఐ వైస్‌ ప్రెసిడెంట్ 






ఏంటీ కేసు..? (Toshakhana Case)


Dawn పేపర్ ఇచ్చిన వివరాల ప్రకారం...2020లో ఓ జర్నలిస్ట్ రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్ లా ఉపయోగించి సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద ఎత్తున గిఫ్ట్‌లు అందాయని వెల్లడించాడు. అయితే...నిపై అప్పటి పాక్ మంత్రులంతా మండి పడ్డారు. అలాంటి వివరాలు బయట పెడితే అంతర్జాతీయ దేశ పరువుకు భంగం వాటిల్లుతుందని అన్నారు. అప్పటికే Federal Information Commissionలో కేసు నమోదు చేశారు. అయినా ప్రభుత్వం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఫలితంగా హైకోర్టుని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇదే ఆయన పదవికి ఎసరు పెట్టింది. ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇమ్రాన్‌పై అనర్హతా వేటు వేయాలని కోరాయి. గల్ఫ్ దేశాలు గిఫ్ట్ ఇచ్చిన కాస్ట్‌లీ వాచ్‌లను అమ్మేసి పెద్ద మొత్తంలో సంపాదించారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి బదులు ఇవ్వకపోవడం వల్ల పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హతా వేటు వేసింది. 2022లో ఉన్నట్టుండి ఆయన తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిదే కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. 


Also Read: Nirmala Sitharaman: మేం ఏ సంస్థనూ అమ్మేయడం లేదు, ప్రభుత్వ వాటా తప్పక ఉంటుంది - నిర్మలా సీతారామన్