ABP  WhatsApp

PM Modi Italy Visit: ఇటలీలో ప్రధానికి ఘన స్వాగతం.. మహాత్ముడికి మోదీ నివాళి

ABP Desam Updated at: 29 Oct 2021 08:12 PM (IST)
Edited By: Murali Krishna

రోమ్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ఇటలీలో మోదీకి ఘన స్వాగతం

NEXT PREV

ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రోమ్ నగరంలోని పియాజ్​ గాంధీ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ప్రధాని మోదీకి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు చేశారు. తనను స్వాగతించేందుకు వచ్చిన ప్రజలతో మోదీ కాసేపు ముచ్చటించారు. 







రోమ్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించే అవకాశం దక్కింది. మాహాత్ముడి మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమందికి ధైర్యం, స్ఫూర్తిని ఇచ్చాయి.                                                             -  ప్రధాని నరేంద్ర మోదీ






జీ20 సమావేశం కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైకేల్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డెర్‌ లెయన్‌తో సమావేశమయ్యారు. ఐరోపా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు, వాతావరణ మార్పు, కొవిడ్-19, అంతర్జాతీయ, ప్రాంతీయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.


ఇదే షెడ్యూల్..





ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ఆహ్వనం మేరకు రోమ్, వాటికన్ సిటీలో అక్టోబర్ 29-31 వరకు ప్రధాని మోదీ పర్యటిస్తారు. అనంతరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు గ్లాస్గో నగరాన్ని సందర్శించనున్నారు.


ఇటలీ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీని సందర్శించనున్న ప్రధాని మోదీ.. అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌ను కలవనున్నట్లు సమాచారం. 


అక్టోబర్ 30-31 తేదీల్లో జీ20 సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో ద్వైపాక్షిక భేటీ కూడా ఉంది. జీ20 సమావేశం అనంతరం గ్లాస్గోలో జరగనున్న కాప్26 వరల్డ్ లీడర్స్ సమిట్​లోనూ మోదీ పాల్గొంటారు.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 14,348 కరోనా కేసులు, 805 మరణాలు నమోదు


Also Read: WHO ON Covaxin: భారత్ టీకాలు భేష్.. కొవాగ్జిన్‌కు త్వరలోనే అనుమతి: డబ్ల్యూహెచ్ఓ


Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ


Also read:  అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే






Published at: 29 Oct 2021 08:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.