Bengaluru IT professional Living Cost: మన దేశంలో అంబానీలు బతుకుతున్నారు.. నిరుపేదలు బతుకుతున్నారు. ఎవరి జీవన విధానం.. ఆదాయం.. ఖర్చులు వారివి. రోజుకు నాలుగు, ఐదు వందలు సంపాదించుకునే వారూ బతుకుతున్నారు. అయితే ఫలనా చోట్ల లక్షలు సంపాదించినా బతకడం కష్టంగా ఉందని సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని కొంత మంది తెగ బాధపడిపోతున్నారు. బెంగళూరులో నివసించే ఐటీ ఉద్యోగుల్లో కొంత మంది ఇలాంటి ఓవరాక్షన్ ఎక్కువగా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పీలే రాజా అనే వ్యక్తి నెలకు ఐదు లక్షల 70వేలు సంపాదించినా సరిపోవడం లేదని.. లెక్కలు పోస్టు చేశారు. అందులో ఉన్న వివరాలు చూసి నెటిజన్లకు పిచ్చెక్కిపోయింది.
పీలే రాజా అనే ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ ప్రకటించిన దాని ప్రకారం చూస్తే.. ఐదు లక్షలు కాదు.. పది లక్షలు సంపాదించినా సరిపోవని.. దానికి బెంగళూరు జీవన వ్యయానికి సంబంధం ఏమిటని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి ఖర్చులు పెట్టుకుని.. జీతం సరిపోవడం లేదంటే ఎలా అని మండిపడుతున్నారు.
అటెన్షన్ కోసం సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవలి కాలంలో కొంత మంది బెంగళూరు టెకీలు ఇలాగే లక్షలు సంపాదిస్తున్నా సరిపోవడం లేదని పోస్టులు పెడుతున్నారు. అయితే లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకుని...జీతం సరిపోవడం లేదంటే ఎలాఅని.. వస్తున్న ఆదాయాన్ని.. సేవింగ్స్ చూసుకుని దానికి తగ్గట్లుగా జీవిస్తే.. జీతం సరిపోతుందని .. ఇలాంటి పోస్టులు పెట్టి బెంగళూరుల జీవన వ్యయం ఎక్కువ అని ప్రచారం చేయడం ఏమిటన్న ప్రశ్నలు వేస్తున్నారు.